శ్రీ సత్య సాయి జిల్లా: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు నిరసనల సెగ తగులుతోంది. హిందూపురం మూడో వార్డు శాంతినగర్‌లో చేపట్టిన కార్యక్రమంలో MP గోరంట్ల మాధవ్, MLC ఇక్బాల్ అహ్మద్ పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలేదని స్థానికి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తాం..ఎమ్మెల్సీని నిలదీయవద్దంటూ కాలనీ వాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పీఏ, వైసీపీ నాయకుడు గోపికృష్ణ. ఇదే సమయంలో వీడియో తీస్తున్న ఏబీఎన్ రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి సెల్‌ఫోన్‌ను గోపికృష్ణ లాకున్నారు. గోపికృష్ణ తీరుపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు.
ఇవి కూడా చదవండి