మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-03-08T05:34:02+05:30 IST

మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నారని దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
దర్శిలో ర్యాలీలో మాట్లాడుతున్న డీఎస్‌పీ

డీఎస్పీ ప్రకాశరావు

దర్శి, మార్చి 7 : మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతున్నారని దర్శి డీఎస్పీ కె.ప్రకాశరావు పేర్కొన్నారు. సోమవారం జరిగే అంతర్జాతీయ మహిళాధినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మహిళలు కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కె.ప్రకాశరావు మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో దర్శి సీఐ ఎం.భీమానాయక్‌, ఎంపీడీవో గుత్తా.శోభన్‌బాబు, దర్శి నగర పంచాయతీ కమిషనర్‌ ఆవుల.సుధాకర్‌, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు ఎస్సైలు రామకోటయ్య, నరసింహారావు, వెంకటసైదులు, శివనాగరాజు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కందుకూరులో

కందుకూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరులో డీఎస్పీ కండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళలు, మహిళా పోలీసులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక పట్టణ పోలీసు స్టేషను వద్ద నుంచి పోస్టాఫీసు కూడలి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి గొప్పతనాన్ని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ ఎం.విజయకుమార్‌, పట్టణ  ఎస్‌ఐ కేకే తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:34:02+05:30 IST