వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూట్‌

ABN , First Publish Date - 2021-04-28T05:30:00+05:30 IST

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’... లాక్‌డౌన్‌ల పరంపరలో దాదాపు ఉద్యోగస్తులందరికీ అనుభవంలోకి వచ్చిన ‘ట్రెండ్‌’ ఇది. ఆఫీసుకు వెళ్లేటప్పుడంటే లెక్కకు మించిన వెరైటీ డ్రెస్సులున్నాయి.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సూట్‌

‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’... లాక్‌డౌన్‌ల పరంపరలో దాదాపు ఉద్యోగస్తులందరికీ అనుభవంలోకి వచ్చిన ‘ట్రెండ్‌’ ఇది. ఆఫీసుకు వెళ్లేటప్పుడంటే లెక్కకు మించిన వెరైటీ డ్రెస్సులున్నాయి. వారిని ఆకట్టుకొనేందుకు ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో మార్కెట్‌ను ముంచెత్తాయి. మరి ఇప్పుడు చాలామంది ఇంట్లో కూర్చొనే కదా పని చేసేది! అలాంటప్పుడు ఇక రంగురంగుల డ్రెస్‌ల అవసరమేముంటుంది? నైట్‌ డ్రెస్‌లాంటివేవో వేసుకుని ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ నడిపించేయచ్చు కదా! నిజమే! కానీ ‘జూమ్‌’ మీటింగ్‌లు తాజా వర్క్‌ కల్చర్‌లో భాగమైపోయాయి. అదే సమయంలో గంటలకు గంటలు కదలకుండా ఒకేచోట కూర్చొని పని చేయాల్సిన పరిస్థితులు వచ్చిపడ్డాయి.


అలాంటప్పుడు సౌకర్యవంతమైన, ధారాళంగా గాలి ఆడే దుస్తులు ధరించకపోతే ఇంట్లోనే ఉన్నా కొత్త సమస్యలు తలెత్తుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్లు నయా వెరైటీలు తీసుకువస్తున్నారు. అలాంటి సరికొత్త కలెక్షనే ప్రముఖ డిజైనర్‌ రీతూ కుమార్‌ రూపొందించిన ‘బేసిక్స్‌’. పని ప్రదేశం మారినప్పుడు దానికి తగినట్టుగా వస్త్రధారణ కూడా మారాలంటారు ఆమె. ఆ క్రమంలోనే సంప్రదాయ, పాశ్చాత్య మేళవింపుతో ఈ నయా కలెక్షన్‌ తెచ్చారు. సౌకర్యంతో పాటు మన్నిక, నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్‌ వీటి ప్రత్యేకత. 

Updated Date - 2021-04-28T05:30:00+05:30 IST