మూడు రోజులు ఆఫీస్... రెండు రోజులు రిమోట్‌ ప్లేస్... గూగుల్ ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్ వీక్’

May 7 2021 @ 12:46PM

 

క్యాలిఫోర్నియా : సెర్చింగ్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతిలో గూగుల్ ఉద్యోగులు వారంలో కేవలం మూడు రోజులు కార్యాలయానికి వస్తే సరిపోతుంది. మిగతా రెండు రోజులు రిమోట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు గూగుల్, అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కరోనా తగ్గుముఖం పట్టి ఈ ఏడాది చివరి నాటికి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం ఉద్యోగులు ఇంటి నుండే పని చేస్తారని, 60 శాతం మందికి హైబ్రిడ్ వర్క్ వీక్ పద్ధతిలో పని చేసే అవకాశముంటుందని తెలిపారు.


ఈ ఏడాది మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థలో 1.40 లక్షల మంది వరకు పూర్తిస్థాయి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్క భారతదేశంలోనే దాదాపు 4 వేల మంది ఉద్యోగులుంటారని అంచనా. వీరిలో ఎక్కువమంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గురుగ్రామ్‌‌లలో పని చేస్తున్నారు. రిమోట్ ప్రాంతం నుండి పనిచేసే ఉద్యోగులు మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం వరకు ఉంటారని గూగుల్ చెబుతోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.