కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేసిన సర్కార్

May 7 2021 @ 16:25PM

అమరావతి : రాష్ట్రంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొంది. సచివాలయం, ఆయా శాఖల అధినేతలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల్లో ఈ మార్పులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 12 గంటల తర్వాత కార్యాలయాలు ఉండాలంటే మాత్రం పాసులు కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనకు అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.