సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి

ABN , First Publish Date - 2022-05-22T05:50:19+05:30 IST

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్‌ సంఘ్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుంటుపల్లి బ్రాంచ్‌ కార్యదర్శి గద్దా సురేష్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి
గుంటుపల్లి సంఘ్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న్ద సురేష్‌

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఈయూ బ్రాంచ్‌ కార్యదర్శి సురేష్‌

ఇబ్రహీంపట్నం, మే 21: రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంప్లాయీస్‌ సంఘ్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ యూనియన్‌ గుంటుపల్లి బ్రాంచ్‌ కార్యదర్శి గద్దా సురేష్‌ అన్నారు. యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మర్రి రాఘవయ్య చొరవతో కార్మికుల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు.  2013లో నియామకాలు పొందిన కార్మికులకు బంచింగ్‌ ఇంక్రిమెంట్‌ రూ. 20వేలు, 2016లో పదోన్నతి పొందిన కార్మికులకు ఆప్షనల్‌ ఇంక్రిమెంట్‌ పొందేలా కృషి చేశారని అన్నారు. మహిళలు, దివ్యాంగులు సమస్యలపై పోరాడి సాధించినట్లు తెలిపారు. రైల్వే కాలనీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన కూడా చర్చించి పరిష్కరించారన్నారు.  సికింద్రాబాద్‌ డివిజన్‌ నాయకులు ఆదాం సంతోష్‌కుమార్‌, ఎం.జి.అజయ్‌కుమార్‌, డివిజనల్‌ అధ్యక్షుడు బాబునాయక్‌ మాట్లాడుతూ రాబోయే కార్మిక సంఘాల ఎన్నికల్లో వర్క్‌షాపు బ్రాంచ్‌ని మూడో సారి విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు.  బ్రాంచ్‌ అధ్యక్షుడు పామర్తి శివనాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు దాసరి డేవిడ్‌ రాజు, జీకేడీ ఆంజనేయులు, జి.సుధాకర్‌, లాలయా నాయక్‌, ఎస్‌.బోయాజ్‌, ఎం.డి.రబ్బాని, నాగచంద్రయ్య, రంగారవు, పి.రామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T05:50:19+05:30 IST