పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-07-02T06:33:06+05:30 IST

మనఊరు-మనబడి, మనబడి-మనబస్తీ కార్యక్రమం పాఠశాలల్లో చేపట్టే పనులు వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత ఆదేశించారు.

పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత

పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత

నల్లగొండ టౌన్‌, జూలై 1: మనఊరు-మనబడి, మనబడి-మనబస్తీ కార్యక్రమం పాఠశాలల్లో చేపట్టే పనులు వేగవంతం చేయాలని పాఠశాల విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించడానికి జిల్లాలో పర్యటించినట్లు తెలిపారు. నిర్ధేశించిన గడుపులోపు పనులు పూర్తి చేయాలన్నారు. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పనులకు, ‘మన ఊరు-మనబడి’ కింద చేపట్టే పనులకు వేర్వేరుగా ప్రతిపాదనలు ఉండాల న్నారు. పాఠశాలల పనుల విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలల్లో పనుల విషయంలో ఎక్కడైన ఇసు క కొరత ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ రమణకుమార్‌, అదనపు స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. రమేష్‌, డీఈవో భిక్షపతి, పీఆర్‌ఈఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలి 

కట్టంగూరు: ‘మనఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీ హరిత, కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. మండలంలోని అంబేడ్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాల, దుగినవెళ్లి జడ్పీహెచ్‌ఎ్‌సలో కొనసాగుతున్న ‘మన ఊరు-మనబడి’ పనులను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. దుగినవెళ్లి పాఠశాలలో రూ.22లక్షలతో చేపడుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలో కొనసాగుతున్న ఎలక్ట్రీషియన్‌ పనులను పరిశీలించడంతోపాటు పాఠశాల ఎన్‌రోల్‌మెంట్‌ బడిబాట కార్యక్రమం గురించి పాఠశాల హెచ్‌ఎం వీరారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో భిక్షపతి, ఎంఈవో నాగయ్య, తహసీల్దార్‌ దేశ్యా, ఎంపీడీవో సునీత, డీఈ శైలజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇందిర, వీరారెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్లు రవి, సత్యనారాయణ, ఉపాధ్యాయులు మురళయ్య, లలిత జ్యోతి, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.  

Updated Date - 2022-07-02T06:33:06+05:30 IST