నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-29T06:16:06+05:30 IST

మన ఊరు, మన బడి పథకం పనుల ను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన ఊరు, మన బడి పథకానికి ఎంపికైన పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు ముందుగా అనుమతులు పొందాలన్నా రు.

నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 28: మన ఊరు, మన బడి పథకం పనుల ను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన ఊరు, మన బడి పథకానికి ఎంపికైన పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు ముందుగా అనుమతులు పొందాలన్నా రు. జూన్‌ నెలాఖరు వరకు మండలాని కి రెండు చొప్పున పాఠశాలలను నిర్దేశించిన సమయాని కి అన్ని హంగులతో తీర్చిదిద్దాలన్నారు. ఈనెల 30వ తేదీనుంచి పనులుప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, పీఆ ర్‌ ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు రమేష్‌, మనోహర్‌, ప్రభాకర్‌,వెంకటేశ్వర్లు, సతీ్‌షకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి:డీజీపీ

సూర్యాపేటక్రైం: జిల్లాల్లో నేరాలు జరగకుండా పోలీస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని, కేసులను పెండింగ్‌లో పెట్టకుండా వేగవంతంగా విచారణ పూర్తిచేయాలన్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల విక్రయాలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల అమ్మకాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి, గుట్కా రవాణాను అడ్డుకునేందుక చెక్‌ పోస్టులు ఏర్పాటుచేశామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎస్పీలు పి.నాగభూషణం, జి.వెంకటేశ్వర్‌రెడ్డి, రెహమాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T06:16:06+05:30 IST