అంకితభావంతో పనిచేయండి

Jun 16 2021 @ 23:41PM
నియామక ఉత్తర్వులు అందిస్తున్న డీఈవో నాగమణి

డీఈఓ నాగమణి

వ్యాయామ ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు 

కలెక్టరేట్‌, జూన్‌ 16: ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారంతా అంకితభావంతో పనిచేసి చక్కని సేవలు అందజేయాలని డీఈవో నాగమణి సూచించారు. 2018 డీఎస్సీకి సంబంధించి వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం ఆమె నియామక ఉత్తర్వులను అందజేశారు. కోర్డు కేసు కారణంగా వీరి నియామకం ఆలస్యమైంది. న్యాయస్థానం నుంచి ఆదేశం వచ్చిన వెంటనే భర్తీ చేపట్టారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 13 మందికి ఉత్తర్వులు అందజేశారు. 



Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.