జీతం కోసం కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-07-27T04:43:46+05:30 IST

మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌ అనే వ్యక్తి సోమవారం పెట్రోల్‌ పోసుకుని పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఆత్మహత్యాయత్నానికి ప్ర యత్నించాడు.

జీతం కోసం కార్మికుడి ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నం చేస్తున్న రమే్‌షను అడ్డుకుంటున్న స్థానికులు

నందలూరు, జూలై 26 : మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ పంచాయతీలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌ అనే వ్యక్తి సోమవారం పెట్రోల్‌ పోసుకుని పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఆత్మహత్యాయత్నానికి ప్ర యత్నించాడు. దాదాపు సంవ త్సరానికి పైగా డ్రైవర్‌గా పనిచేస్తున్నా అతనికి జీతం ఇవ్వలేదని తెలిపాడు. సంబంధిత అధికారిని జీతం ఇవ్వాలని అడగ్గా అతను నీ ఇష్టమొచ్చిన వారికి చెప్పుకో... ఎక్కడైనా దూకి చావండి తాము జీతాలు చెల్లించలేమని చెప్పాడని దీంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నకు యత్నించానని తెలిపాడు. స్థానికులు, పంచాయతీ సిబ్బంది రమే్‌షను అడ్డుకున్నారు. దీంతో పంచాయతీలో పనిచేస్తున్న మిగిలిన కార్మికులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి జీతాలు ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-27T04:43:46+05:30 IST