కార్మిక చట్టాలను మార్పు చేస్తే ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2022-07-02T06:00:49+05:30 IST

కార్మికులు సాధించుకున్న చట్టాలను మార్పుచేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

కార్మిక చట్టాలను మార్పు చేస్తే ఉద్యమిస్తాం
భీమవరంలో కార్మికుల నిరసన

భీమవరం అర్బన్‌, జూలై 1: కార్మికులు సాధించుకున్న చట్టాలను మార్పుచేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 12 గంటల పని విధానాన్ని తెరపైకి తెస్తున్న కేంద్ర ప్రభుత్వం కుట్రను కార్మికులందరు వ్యతిరేకించాలని ఏఐటీయుసీ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు పిలుపునిచ్చారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్రిటిష్‌ సామ్య్రవాదుల నుంచి కార్మికులు ప్రాణాలర్పించి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నారని, నేడు ఆ చట్టాలను 4 కోడ్‌లుగా మార్చే ప్రయత్నం చూస్తూ ఊరుకోబోమన్నారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యునియన్‌ నాయకులు బంగారుశివ, ధనల దుర్గారావు, సత్యానంద్‌, విజయకుమర్‌ పాల్గొన్నారు. 


తాడేపల్లిగూడెం రూరల్‌: కార్మిక హక్కులను హరించే లేబర్‌ కోడ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ విజ్ఞప్తి చేశారు. జూలై 1 నుంచి కొన్ని రాష్ట్రాల్లో లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ తాడేపల్లిగూడెంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి తాడికొండ శ్రీనివాస్‌, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు పడాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:00:49+05:30 IST