నత్తనడకన పనులు

Published: Mon, 28 Mar 2022 01:45:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నత్తనడకన పనులుఅమలాపురంలో కలెక్టరేట్‌ భవనంవద్ద జరుగుతున్న నిర్మాణ పనులు

జిల్లా కార్యాలయాల నిర్మాణంలో జాప్యం

ముమ్మిడివరం ఎయిమ్స్‌కు రాని క్లియరెన్స్‌?

ఉగాదికి భవనాలు సిద్ధమయ్యేనా..?

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): 

అమలాపురం కేంద్రంగా ఆవిర్భవించనున్న కోనసీమ జిల్లాకు కార్యాలయాల ఏర్పాట్ల పను లు నత్తనడకన సాగుతున్నాయి. కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయాల పనులు ఉగాది నాటికి పూర్తయ్యే పరిస్థితులు కానరావడంలేదు. ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసే భవనానికి సంబంధించి తుది మెరుగులు దిద్దే పనులు శరవేగంగానే సాగుతున్నాయి. ఇక ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల భవన సముదాయానికి ఆయా శాఖల అధికారులు వెళ్లి పరిశీలన చేసుకోవడం తప్ప అక్కడ ఎలాంటి పనులు చేపట్టే పరిస్థితి లేదు. ఉగాది పర్వదినం సందర్భంగా వచ్చేనెల 2న అమలా పురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకు రూ.3కోట్ల వంతున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. సివిల్‌ వర్క్స్‌, ఫర్నీచర్‌ కొనుగోలుకు సంబం ధించి ప్రభుత్వం పిలిచిన టెండర్లకు స్పందన రాకపోవడంతో అధికారులే ప్రభుత్వ అనుమ తి తో ఫర్నీచర్‌ కొనుగోలుకు చర్యలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నెలాఖరులోగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఉగాది రోజున ఆయా కార్యాలయాలవద్ద మొక్కుబడిగానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం. అమలాపురం పట్టణంలో నల్ల వంతెనవద్దఉన్న డీఆర్‌డీఏ భవన సముదాయంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్‌ ఏర్పాటు చేసేందు కు నిర్ణయించిన అధికారులు ఆ భవనాల్లో పనులు చేపట్టారు. పనులు మందకొడిగా సాగు తుండడంతో పురోగతి ఇప్పట్లో అసాధ్యమే. సీలింగ్‌ పనులు కూడా ఇంకా చేపట్టలేదు. గోడలు, ఇతర నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అండర్‌గ్రౌండ్‌ పవర్‌ సప్లయి పనులు ప్రారం భించారు. ఎస్పీ కార్యాలయం నల్లవంతెనవద్దనున్న మాంటిస్సోరి పబ్లిక్‌ స్కూలు భవనంలో ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇక్కడ పనులు వేగంగానే సాగుతున్నాయి. ఇక జిల్లాకు సంబంధించి 24 ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ కళాశాలలో ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌ ప్రతిపాదనలు పంపించారు. వాటికి ఆమోద ముద్ర పడిన వెంటనే ఎయిమ్స్‌ కళాశాలలో వివిధ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఎయిమ్స్‌ కళాశాలకు చెందిన గదులను ఖాళీచేసి అప్పగించడానికి నిర్వాహకులు గడువు కోరడంతో ఇక్కడ కార్యాలయాల ఏర్పాటులో జాప్యం జరగనున్నట్టు సమాచారం. ప్రభుత్వం సైతం నోటిషికేషన్‌ తర్వాత కొంత వ్యవధి ఇచ్చి కార్యాలయాల ఏర్పాటు, నిర్వహణపై దృష్టి సారించే అవకాశాలు ఉండడంతో అధికార యంత్రాంగం కూడా లైట్‌ తీసుకుంటుంది. దీంతో కొన్ని శాఖల కార్యాలయాల ఏర్పాటుకు మరింత సమయం పట్టే అవకాశముందని సమాచారం.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.