Viral News: స్పెయిన్ నుంచి వచ్చిన కంటైనర్.. అందులో ఏముందో చూసిన తర్వాత ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2022-07-30T16:51:19+05:30 IST

సముద్రం మార్గంలో కొన్ని వందలాది షిప్‌లు నిత్యం ఒక దేశం నుంచి మరో దేశానికి కంటైనర్‌ల ద్వారా సరకు రవాణా చేస్తాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పెయిన్ నుంచి వచ్చిన ఓ కంటైనర్‌(Container)ను ఓపెన్ చూసి అధికారులు ఒక్కసారిగా

Viral News: స్పెయిన్ నుంచి వచ్చిన కంటైనర్.. అందులో ఏముందో చూసిన తర్వాత ఒక్కసారిగా నోరెళ్లబెట్టిన అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: సముద్రం మార్గంలో కొన్ని వందలాది షిప్‌లు నిత్యం ఒక దేశం నుంచి మరో దేశానికి కంటైనర్‌ల ద్వారా సరకు రవాణా చేస్తాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పెయిన్ నుంచి వచ్చిన ఓ కంటైనర్‌(Container)ను ఓపెన్ చూసి అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇంతకూ ఆ కంటైనర్‌లో అధికారులు ఏం గుర్తించారు. ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఏంటి అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


ఎప్పటిలాగే స్పెయిన్(Spain) నుంచి పనామా సిటీ(Panama City) లోని పోర్టుకు ఓ కంటైనర్ షిప్ వచ్చింది. ఈ క్రమంలో స్థానిక అధికారులు.. ఆ షిప్‌లో ఉన్న ఓ కంటైనర్‌ను ఖాళీగా ఉందని భావించారు. తర్వాత దాన్ని ఓపెన్ చూసి షాకయ్యారు. కంటైనర్‌లో కనిపించిన దృశ్యాలు చూసి వారి మైండ్ బ్లాంక్ అయింది. అందులో ఏడాది వయసున్న చిన్న కుక్క(DOG) ఉండటాన్ని గుర్తించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న అధికారులు.. 40 రోజులపాటు తిండి, నీళ్లు లేకుండా కంటైనర్‌లో ఉన్న కుక్కను చూసి కంగుతిన్నారు. అనంతరం దాని విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 



దాన్ని శునకాలకు వైద్యం చేసే డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ ఘటన జనవరిలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ శునకం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ అధికారులు.. ఆ శునకానికి మిలాగ్రస్( Milagros) అనే పేరు పెట్టి.. ముద్దగా మిలి అని పిలుచుకుంటున్నారు. అంతేకాకుండా ఈ 5-6నెలలపాటు చేడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించే విషయంలో మిలట్రీ అధికారుల వద్ద ట్రైనింగ్ కూడా ఇప్పించారు. ఈ క్రమంలోనే పనామాలోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్‌(MIDA) లో ఉద్యోగం పొంది.. విధులు కూడా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అక్కడి అధికారులు మాట్లాడుతూ.. దాని పని తనాన్ని గురించి చెబుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కంటైనర్‌లోకి శునకం ఎలా చేరింది అనే విషయంపై స్పష్టత లేదు.


Updated Date - 2022-07-30T16:51:19+05:30 IST