బతుకమ్మ చీరలతో కార్మికులు, ఆసాములకు ఒరిగింది ఏమీ లేదు

ABN , First Publish Date - 2022-01-21T06:15:11+05:30 IST

సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తులతో కార్మికులకు, ఆసాములకు ఒరిగింది ఏమీ లేదని లాల్‌ బావుటా చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి అన్నారు.

బతుకమ్మ చీరలతో కార్మికులు,   ఆసాములకు ఒరిగింది ఏమీ లేదు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవి

- బడాబాబుల కోసమే బతకమ్మ చీరలు ఉత్పత్తి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 20: సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఉత్పత్తులతో కార్మికులకు, ఆసాములకు ఒరిగింది ఏమీ లేదని లాల్‌ బావుటా చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణం సీపీఐ జిల్లా కార్యాలయంలో లాల్‌ బావుటా చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం జిల్లా అఽధ్యక్షుడు యెలిగేటి రాజశేఖర్‌ అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలోని కార్మికులు, ఆసాములను ఆర్థికంగా ఆదుకోవాలని  చేపట్టిన బతుకమ్మ చీరల ఉత్పత్తులతో కార్మికులకు, ఆసాములకు ఆర్థిక ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. సిరిసిల్లలోని బడాబాబుల కోసమే బతకమ్మ చీరలు ఉత్పత్తి చేస్తున్నట్లుగా ఉందన్నారు. నేత కార్మికుడికి సంవత్సరకాలంలో ఐదు నెలల పాటు బతుకమ్మ చీరల ఉత్పత్తి చేస్తే నెలకు రూ. 12 వేలు చొప్పున దా దాపు రూ. 50 వేలు వేతనం పొందుతున్నారని అన్నారు. సిరిసిల్లలోని బడా వస్త్ర వ్యాపారులు దాదాపు 15 నుండి 20 వరకు మాక్స్‌, ఎస్‌ఎ్‌ససీ సంఘాలను తమ దగ్గర పెట్టుకొని ఒక్కో యజమాని సుమారు రూ. 60 నుండి 70 లక్షల గుడ్డను ఉత్పత్తి చేస్తున్నాడని దీని ద్వారా ఒక్కో యజమాని సంవత్సర కాలానికి రూ. 3 కోట్లు లాభాలు పొందుతున్నారని చెప్పారు. దీన్ని బట్టి బతకమ్మ చీరల ఉత్పత్తి పథకం కార్మికులు, ఆసాముల కోసమా యజమానుల కోసమా స్పష్టం అవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో యారన్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తే ఆసామి దాని ద్వారా కార్మికుడికి లాభం జరిగే అవకాశం ఉందన్నారు. వర్క్‌ టూ ఓనర్‌ పథకం ద్వారా కార్మికులందరినీ ఓనర్లుగా చేస్తానన్న మంత్రి కేటీఆర్‌ మాటలు నీటి మూటలయ్యాయని అన్నారు. ఈ పథకం ఎప్పటి వరకు పూర్తి అవుతుందో కార్మికులకు మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నాయకులు అజ్ఞ వేణు, ఒగ్గు గణేష్‌, సుధాకర్‌లు పాల్గొన్నారు

Updated Date - 2022-01-21T06:15:11+05:30 IST