భారతీయుల తరలింపునకు మానవతా కారిడార్‌‌: రష్యా హామీ

Published: Wed, 02 Mar 2022 16:48:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భారతీయుల తరలింపునకు మానవతా కారిడార్‌‌: రష్యా హామీ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా భారత్‌కు చేరుకునేలా 'మానవతా కారిడార్' (హ్యుమనటేరియన్ కారిడార్) ఏర్పాటు చేసేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యాకు చేర్చి అక్కడి నుంచి భారత్‌కు పంపనుంది. ఇందుకోసం శీఘ్ర చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. భారతీయుల భద్రతాంశంపై ఆ దేశంతో రష్యా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా 'సేఫ్ పాసేజ్'కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభంతో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన కారణంగా ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్‌కు సరఫరా చేసే విషయంలో అవరోధాలు తలెచ్చే అవకాశాలపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అలాంటిదేమీ ఉంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. రష్యా ఆయుధాలపై ఆధారపడినందు వల్ల కాకుండా ఉక్రెయిన్‌లో పరిస్థితిని అంచనా వేసే భారత్ 'నిష్పాక్షిక' వైఖరి ప్రదర్శించిందని అలిపోవ్ ప్రశంసించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.