సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రచనలు

ABN , First Publish Date - 2022-06-25T06:52:43+05:30 IST

సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు రచనలు చేశారని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అన్నారు.

సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా రచనలు
మాట్లాడుతున్న డీఈవో

- జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, జూన్‌ 24: సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు రచనలు చేశారని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని శివనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు రచించిన సిరిసిల్ల సిరిమల్లెలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా డీఈవో మాట్లాడుతూ పుస్తకంలో పిల్లలు రాసిన రచనలు చాలా బాగున్నాయని, వారి అనుభవాలతో రచనలు చేశారని అన్నారు. పిల్లలతో పాటు పత్తిపాక మోహన్‌ అందించిన సహకారం అభినందనీయమన్నా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు చేసిన రచనలు భవిష్యత్‌తరాలకు ఉప యోగపడాలని అన్నారు. నేషనల్‌ బుక్‌ట్రస్టు ఆఫ్‌ ఇండియా ఉప సంపాదకులు డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ మాట్లాడు తూ పిల్లలలో ని సృజనాత్మకత ఈ పుస్తకం ద్వారా బయటకు వచ్చిందని అన్నా రు. ఈ పుస్తక రచనలో 32 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇది ఆరంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో చాలా పుస్తకాలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గెంట్యాల శ్రీనివాస్‌, ప్రధానోపా ధ్యాయుడు పరబ్రహ్మమూర్తి, ఉపాధ్యాయులు వంత డుపుల ఆంజనేయులు, పాకాల శంకర్‌గౌడ్‌, దేవతప్ర భాకర్‌, నషీరొద్దీన్‌, మల్లారపు పురుషోత్తం, కుమ్మరి మల్లేశం, అంజయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా సిరిసిల్ల సిరిమల్లెలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాని కి ఐటీ, పుర ాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వస్తున్నారని పాఠశాలలో అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రారంభోత్సవా నికి మంత్రి రాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థు లు నిరాశకు గురయ్యారు.

Updated Date - 2022-06-25T06:52:43+05:30 IST