రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-27T05:53:19+05:30 IST

రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేద్దామని కలెక్టర్‌ వీరపాండియన్‌ పిలుపునిచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేద్దాం: కలెక్టర్‌
రాజ్యాంగ ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌ వీరపాండియన్‌, అధికారులు

కర్నూలు(అర్బన్‌), నవంబరు 26: రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేద్దామని కలెక్టర్‌ వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. సునయన ఆడిటోరియంలో 71వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. హక్కులతో పాటు విధులు, బాధ్యతలు ముఖ్యమని అన్నారు. ప్రభుత్వ పథకాలు, చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయని, ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే హక్కు పౌరులకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఉద్యోగులు, అధికారులు ప్రజా సేవకులు అని, ఇది గుర్తెరిగి విధులు నిర్వహించాలని సూచించారు. అధికారులతో రాజ్యాంగ ప్రమాణం చేయించారు.


Updated Date - 2020-11-27T05:53:19+05:30 IST