‘స్వర్ణ’ రేసులో నీరజ్‌

ABN , First Publish Date - 2022-07-15T10:15:31+05:30 IST

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌..ఒలింపిక్స్‌ తర్వాత అథ్లెటిక్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మెడల్‌ అందుకోవడాన్ని అరుదైన గౌరవంగా,,

‘స్వర్ణ’ రేసులో నీరజ్‌

శ్రీశంకర్‌పైనా పతక ఆశలు

నేటినుంచి వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

యూజీన్‌ (అమెరికా) : వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌..ఒలింపిక్స్‌ తర్వాత అథ్లెటిక్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌. ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మెడల్‌ అందుకోవడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తాడు ప్రతీ అథ్లెట్‌. రెండేళ్లకోసారి జరిగే ఈ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పనకు శుక్రవారం తెరలేవనుంది. 10 రోజుల ఈ మెగా టోర్నీలో 192 దేశాలనుంచి మొత్తం 1900 మంది అథ్లెట్లు తలపడుతున్నారు. భారత్‌నుంచి 20 మంది  క్రీడాకారులు బరిలో నిలిచారు. అయితే అందరి కళ్లూ ఒలింపిక్‌ చాంపియన్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపైనే ప్రధానంగా నిలిచాయి. అలాగే పురుషుల లాంగ్‌జం్‌పలో శ్రీశంకర్‌పైనా పతక అంచనాలు ఉన్నాయి.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు నీరజ్‌ అద్భుత ఫలితాలు సాధించాడు. రెండుసార్లు తన వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని మెరుగుపరుచుకున్నాడు. గత నెల 14న జరిగిన పావో నూర్మి గేమ్స్‌లో 89.30 మీ. జావెలిన్‌ విసిరిన ఈ భారత స్టార్‌..అదే నెల 30 స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లో ఏకంగా 89.94 మీ. దూరంతో అబ్బురపరిచాడు. ఈమధ్యలో అతడు తేమ వాతావరణంలో జరిగిన క్యుర్టేన్‌ గేమ్స్‌లో 86.69 మీ. దూరంతో స్వర్ణం కైవసం చేసుకోవడం విశేషం. ఈనేపథ్యంలో..వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్‌ పసిడి పతకంపై అంచనాలు పెరిగిపోయాయి. పసిడి పతక రేసులో గ్రెనడాకు చెందిన డిఫెండింగ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌..నీరజ్‌కు సవాలు విసురుతున్నాడు. ఈ సీజన్‌ టాప్‌-5 దూరాలలో 4 అండర్సన్‌ విసిరినవే ఉన్నాయి. నీరజ్‌తోపాటు రోహిత్‌ యాదవ్‌ కూడా జావెలిన్‌ త్రోలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ రౌండ్లు ఈనెల 21న నిర్వహిస్తారు. రెండు రోజుల అనంతరం ఫైనల్‌ జరుగుతుంది. 


శ్రీకర్‌ ఏంచేస్తాడో..

లాంగ్‌జం్‌పలో జాతీయ రికార్డు హోల్డర్‌ మురళీ శ్రీశంకర్‌పైనా పతక అంచనాలు లేకపోలేదు. ఫెడరేషన్‌ కప్‌లో 8.36 మీ. లంఘించిన శ్రీంకర్‌.. ఒలింపిక్‌ చాంపియన్‌ మిల్టయిడిస్‌ (గ్రీస్‌)తో కలిసి ఈ సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక కఠినమైన ప్రత్యర్థులతో ఉన్న పురుషుల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో అవినాశ్‌ సబ్లే ఏమాత్రం సత్తా చాటుతాడో చూడాలి. 


‘చీతా’ ఎవరో?

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అనగానే అందరి దృష్టి పురుషులు, మహిళల 100 మీ.పైనే ముఖ్యంగా నిలుస్తుంది. ఈసారి పురుషుల 100 మీ.లలో అమెరికా, మహిళల్లో జమైకా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షెల్ల్లీ ఆన్‌ ఫ్రేజర్‌, ఎలైన్‌ థాంప్సన్‌, షెరీకా జాక్సన్‌ల జమైకన్‌ త్రయం మూడు పతకాలను కొల్లగొడతారని భావిస్తున్నారు. వీరికి అమెరికానుంచి ప్రధానంగా పోటీ ఎదురుకానుంది. పురుషుల్లో అమెరికాకు చెందిన ఫ్రెడ్రిక్‌ కెర్లీ, ట్రేవన్‌ బ్రోమెల్‌, మార్విన్‌ బ్రేసీ, ప్రస్తుత చాంపియన్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌లలో ముగ్గురు పతకాలు చేజిక్కించుకుంటారని అంచనా వేస్తున్నారు. అయితే మాజీ చాంపియన్‌ యోహాన్‌ బ్లేక్‌ తదితర జమైకా అథ్లెట్లు అమెరికాకు గట్టి పోటీ ఇవ్వనున్నారు.  


నేటి షెడ్యూల్‌

భారత కాలమానం ప్రకారం (సోనీ నెట్‌వర్క్‌లో)

మహిళల 20 కి.మీ. నడక-ఫైనల్‌ (శుక్రవారం రాత్రి 1.40) : ప్రియాంక గోస్వామి

పురుషుల 20 కి.మీ. నడక-ఫైనల్‌ (శనివారం తెల్లవారుజాము 3.40) : సందీప్‌ కుమార్‌

పురుషుల 3వేల మీ.స్టీపుల్‌ చేజ్‌ హీట్స్‌ (శనివారం ఉ. 5.45) : అవినాశ్‌ ముకుంద్‌ సబ్లే

పురుషుల లాంగ్‌జంప్‌ క్వాలిఫికేషన్‌ (శనివారం ఉ. 6.30) : శ్రీశంకర్‌, అనీస్‌, జెస్విన్‌

పురుషుల షాట్‌పుట్‌ క్వాలిఫికేషన్‌ (శనివారం ఉ.7.25) :  తజిందర్‌పాల్‌

Updated Date - 2022-07-15T10:15:31+05:30 IST