ఆరోగ్యరంగం బలోపేతానికి... భారత్‌కు... బిలియన్ డాలర్ల రుణం

ABN , First Publish Date - 2022-07-01T21:34:05+05:30 IST

ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే క్రమంలో... భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల రుణాన్నందించేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది.

ఆరోగ్యరంగం బలోపేతానికి...  భారత్‌కు... బిలియన్ డాలర్ల రుణం

* world bank ఆమోదం

న్యూఢిల్లీ : ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసే క్రమంలో... భారత్‌కు ఒక బిలియన్ డాలర్ల రుణాన్నందించేందుకు  ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. ఈ రుణంతో... దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం నిరుడు అక్టోబరులో ప్రారంభించిన ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM)’కు ప్రపంచ బ్యాంక్ తోడ్పాటునందించనుంది. భారత్‌లో ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు, మరింత అభివ‌ృద్ధి చేసేందుకు... ప్రపవచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ద్వారా మొత్తం $500 మిలియన్ల చొప్పున రెండు కాంప్లిమెంటరీ రుణాలకు ఆమోదం లభించింది.


ఈ క్రమంలో... దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం నిరుడు అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM)కు  ప్రపంచ బ్యాంక్ సాయమందుతున్నట్లైంది. జాతీయస్థాయిలో ప్రమేయంతో పాటు, ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యతనిచ్చేందుకు ఈ రుణాలలో ఒకదానిని వ్యయం చేయనున్నారు. అవసరమైన ప్రజారోగ్య కార్యకలాపాలకు, అలాగే దేశంలో ఆరోగ్యసంరక్షణ సేవల నాణ్యత సహా సమగ్రతను మెరుగుపరచడానికి సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ రుణాల ప్రధాన లక్ష్యం.


భారత్  కోసం ప్రపంచ బ్యాంకు యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడెకి మోరీ మాట్లాడుతూ ‘COVID-19 వ్యాప్తి భారత్‌లో ఆరోగ్యరంగ పనితీరును మెరుగుపరచడానికి గణనీయమైన సంస్కరణల ఆవశ్యకతను మళ్ళీ స్పష్టం చేసింది’ అని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం... పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ప్రోగ్రామ్(PHSPP), ఎన్‌హాన్స్‌డ్ హెల్త్ సర్వీస్ డెలివరీ ప్రోగ్రామ్(EHSDP)  అనే ఈ రెండు రుణాలు... భారత్‌లో హెల్త్ సెక్టారును బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. 

Updated Date - 2022-07-01T21:34:05+05:30 IST