పుస్తకం విజ్ఞాన గని

ABN , First Publish Date - 2021-04-24T05:25:48+05:30 IST

పుస్తకం కేవలం హస్త భూషణమే కాదని విజ్ఞాన గని అని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ అన్నారు. కేబీఎన్‌ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని శుక్రవారం ఆ కళాశాల లైబ్రరీ హాల్‌లో నిర్వహించారు.

పుస్తకం విజ్ఞాన గని
మాట్లాడుతున్న వరప్రసాద్‌

పుస్తకం విజ్ఞాన గని

ప్రపంచ పుస్తక దినోత్సవంలో ప్రిన్సిపాల్‌ వరప్రసాద్‌

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 23 : పుస్తకం కేవలం హస్త భూషణమే కాదని విజ్ఞాన గని అని కేబీఎన్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ.వరప్రసాద్‌ అన్నారు. కేబీఎన్‌ కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని శుక్రవారం ఆ కళాశాల లైబ్రరీ హాల్‌లో నిర్వహించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. విజేతలకు ముగింపు సభలో అతిథులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో, ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం అని పలువురు ప్రముఖ సాహితీవేత్తలు వ్యాఖ్యలు అక్షర సత్యాలన్నారు. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుందని కందుకూరి వివరించారని దానిని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. కాలం ఎంతగా మారినా, సినిమాలు, టెలివిజన్‌, ఇంటర్నెట్‌, మొబైల్‌ మాయలెన్ని దరిచేరినా పుస్తకం విలువ చెక్కుచెదరలేదన్నారు. పోటీల్లో బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉన్న అరుదైన పుస్తకాలతో పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. గ్రంథాలయ విభాగాధిపతి వి.తిరుపతిరావు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఎం.వెంకటేశ్వరరావు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.ప్రకాష్‌, పలువురు సీనియర్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:25:48+05:30 IST