
చెన్నై(తమిళనాడు): 2022 వరల్డ్ చెస్ ఒలింపియాడ్ రష్యాలోని మాస్కో నుంచి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరానికి మార్చారు.ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ చెస్ ఒలింపియాడ్ మాస్కో నుంచి చెన్నై నగరానికి మార్చారు. చెన్నైలో ప్రపంచ చెస్ ఒలింపియాడ్ నిర్వహించేందుకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సమర్పించిన బిడ్ను అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ బుధవారం ఆమోదించింది. ఈ ప్రపంచ చెస్ పోటీలు జులై చివరి నుంచి ఆగస్టు నెలల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు.దక్షిణ భారతదేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన మహాబలిపురం ప్రాంతంలో ఉన్న ఫోర్ పాయింట్స్ బై షెరటన్ వద్ద కన్వెన్షన్ సెంటరులో చెస్ పోటీలు నిర్వహించనున్నారు.
తూర్పు భారతదేశంలోని చెన్నై నగరం నుంచి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయిన ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ వచ్చారు.అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ను సాధించిన మొదటి భారతీయ ఆటగాడు మాన్యుయెల్ ఆరోన్ కూడా చెన్నై నగరంలోనే పెరిగారు.గతంలో చెన్నై నగరం 2013 ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చింది, ఇక్కడ మాగ్నస్ కార్ల్సెన్ తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు.
ఇవి కూడా చదవండి