French Open : ఫైనల్‌కు చేరిన వరల్డ్ నెం 1 Iga Swiatek

ABN , First Publish Date - 2022-06-03T02:52:05+05:30 IST

వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. వరుసగా 34వ మ్యాచ్‌లో విజయం సాధించి రెండవసారి ఫ్రెం

French Open : ఫైనల్‌కు చేరిన వరల్డ్ నెం 1 Iga Swiatek

పారిస్ : వరల్డ్ నంబర్ 1, పొలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. ఉమెన్స్ సింగిల్స్ సెమీ-ఫైనల్ పోరులో రష్యా క్రీడాకారిణి డారియా కసత్కియాపై వరుస సెట్లలో 6-2, 6-1 తేడాతో ఘనవిజయం సాధించింది. కోర్ట్ ఫిలిప్పీ చాట్రియర్ కోర్ట్‌పై జరిగిన ఈ మ్యాచ్ కేవలం 64 నిమిషాలు మాత్రమే కొనసాగింది. కాగా వరుసగా 34వ మ్యాచ్‌లో విజయం సాధించి రెండవసారి ఫ్రెంచ్ ఓపెన్ తుది పోరుకు అర్హత సాధించింది.

Updated Date - 2022-06-03T02:52:05+05:30 IST