World's Oldest Dog: ప్రపంచంలోనే వృద్ధ శునకం మృతి.. దాని వయసెంతంటే..

ABN , First Publish Date - 2022-10-06T20:46:29+05:30 IST

ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `పెబుల్స్` సోమవారం కన్ను మూసింది.

World's Oldest Dog: ప్రపంచంలోనే వృద్ధ శునకం మృతి.. దాని వయసెంతంటే..

ప్రపంచంలోనే అతి ఎక్కువ వయసున్న కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `పెబుల్స్` సోమవారం కన్ను మూసింది. ఫాక్స్ టెర్రియర్ జాతికి చెందిన ఈ శునకం గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం 22 సంవత్సరాల ఏడు నెలలు బతికింది. సౌత్ కరోలినాలోని టేలర్స్‌లో తన యాజమానుల ఇంట్లోనే సహజంగా మరణించింది. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో మార్చి 28, 2000న జన్మించిన ఈ కుక్క.. దాని యజమానులైన బాబీ, జూలీ గ్రెగొరీల ఇంటికి వెళ్లి పెబుల్స్‌గా మారింది.


ఇది కూడా చదవండి.. 

Cute Video: ఆ కుక్క ఎలా ఆడుకుంటుందో చూశారా? వైరల్ అవుతున్న వీడియో!


పెబుల్స్ చాలా సంతోషకరమైన, సుదీర్ఘ జీవితాన్ని గడిపిందని జూలీ పేర్కొన్నారు. పెబుల్స్ తన జీవితం కాలంలో మొత్తం 32 కుక్క పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, చాలా ప్రేమ, సంరక్షణ ఇవ్వడం వల్లె పెబుల్స్ ఎక్కువ కాలం బతికిందని జూలీ అన్నారు. పెబుల్స్ జీవితంలోని చాలా రోజులు దేశీయ సంగీతాన్ని వింటూ, ప్రేమను పొందుతూ గడిచాయని గుర్తు చేసుకున్నారు.  

Updated Date - 2022-10-06T20:46:29+05:30 IST