వరల్డ్‌ రికార్డు కోసం కళాకారుల ప్రదర్శన

ABN , First Publish Date - 2022-05-16T06:52:39+05:30 IST

శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌4 నుంచి 5 వరకు తెలంగాణలోని మం చిర్యాలలో ప్రపంచస్థాయి కళాకారుల ప్రదర్శన నిర్వహిస్తున్నారని వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి తెలిపారు.

వరల్డ్‌ రికార్డు కోసం కళాకారుల ప్రదర్శన

24 గంటల 24 నిమిషాల 24 సెకన్ల ప్రదర్శనలకు ఏర్పాటు

అమలాపురం టౌన్‌, మే 15: శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జూన్‌4 నుంచి 5 వరకు  తెలంగాణలోని మం చిర్యాలలో ప్రపంచస్థాయి కళాకారుల ప్రదర్శన నిర్వహిస్తున్నారని వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి తెలిపారు. తెలం గాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మంచి ర్యాలలోని ఎఫ్‌సీఐ ఫంక్షన్‌ హాలులో 24 గంటల 24 నిమిషాల 24 సెకన్ల పాటు ప్రపంచ స్థాయి నాన్‌స్టాప్‌ కళాకారుల ప్రదర్శన వరల్డ్‌ రికార్డు నమోదు కోసం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  కళా వేదిక జాతీయ చైర్మన్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చే ప్రదర్శనలకు సంబంధించిన బ్రోచర్లను ఆదివారం అమలాపు రంలోని డాబా గార్డెన్స్‌లో కన్వీనర్‌ బీవీవీ సత్యనారాయణ ఆవిష్క రించారు. ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కళాకారు లకు పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి జనిపే భీమారావు, కుంపట్ల సుభాషిణి, అరుణ, విత్తనాల వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-16T06:52:39+05:30 IST