వన్డే క్రికెట్ చరిత్రలో.. ఆసీస్ మహిళల జట్టు సరికొత్త రికార్డు!

ABN , First Publish Date - 2021-04-04T23:25:20+05:30 IST

ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. వన్డేల్లో వరుసగా 22 విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది.

వన్డే క్రికెట్ చరిత్రలో.. ఆసీస్ మహిళల జట్టు సరికొత్త రికార్డు!

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. వన్డేల్లో వరుసగా 22 విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఆదివారం కివీస్‌తో జరిగిన వన్డేలో విజయం సాధించిన ఆసీస్ జట్టు వరుసగా 22వ విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు వన్డేల్లో పురుషులు, మహిళ విభాగాల్లో ఇదే ప్రపంచ రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పురుషుల జట్టు పేరున ఉంది. వారు 2003 జనవరి నుంచి 2003 మే వరకు 21 వరుస విజయాలతో ఈ రికార్డు నమోదు చేయగా.. దాన్ని అదే దేశానికి చెందిన మహిళలు తిరగరాయడం విశేషం. ఇక మహిళల జట్టు 2017 అక్టోబర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క వన్డేలో కూడా పరాజం పొందిందిలేదు. ఇలా వరుసగా 22 వన్డేలు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వరల్డ్ రికార్డు పట్ల కంగారు జట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ఆనందం వ్యక్తం చేసింది. ఇది చాలా గొప్ప అచీవ్‌మెంట్ అని ఆమె పేర్కొంది.    

Updated Date - 2021-04-04T23:25:20+05:30 IST