ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉపాధ్యాయుడిని చూశారా?

ABN , First Publish Date - 2022-04-23T17:51:01+05:30 IST

ఆ వ్యక్తిని కొన్ని తరగతుల బోధన నుంచి...

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఉపాధ్యాయుడిని చూశారా?

ఆ వ్యక్తిని కొన్ని తరగతుల బోధన నుంచి నిషేధించారు. దీంతో ఆ ఉపాధ్యాయుడు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బోధించడంలేదు. దీనికి విచిత్రమైన కారణం ఉంది. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ టీచర్‌ని చూసి చాలా భయపడతారు. ఎందుకంటే అతను తన శరీరంపై లెక్కలేనన్ని టాటూలు వేయించుకున్నాడు. దీంతో ఈ ఉపాధ్యాయుడిని  హర్రర్ టీచర్ అని పిలవడం మొదలు పెట్టారు.


 ఆ వ్యక్తి పేరు సిల్వైన్ హెలైన్, సెల్వైన్ గత పదేళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడు. 'డైలీస్టార్' కథనం ప్రకారం, అతను తన శరీరంపై రూ. 51 లక్షలకు పైగా టాటూలు వేయించుకున్నాడు. అతను తన శరీరంపై టాటూలు వేయించుకునేందుకు 460 గంటలు అంటే దాదాపు 20 రోజులు గడిపాడు. సెల్వైన్ తన శరీరంపై చాలా టాటూల కారణంగా 'ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన గురువు'గా గుర్తింపు పొందాడు.  ఫలితంగా కొన్ని తరగతులలో బోధించడానికి అతనిని నిషేధించారు.  సెల్వైన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 91 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో ఫేస్‌బుక్‌లో 13 వేల మందికి పైగా అతన్ని అనుసరిస్తున్నారు. అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో బోధనకు సంబంధించిన అనేక వీడియోలను కూడా అప్‌లోడ్ చేశాడు.  

Updated Date - 2022-04-23T17:51:01+05:30 IST