ఆ యుద్ధంలో 5 కోట్ల మందికిపైగా జనం మృతి.. మళ్లీ ఆనాటి పరిస్థితులు రానున్నాయా?

ABN , First Publish Date - 2022-03-05T14:00:53+05:30 IST

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం..

ఆ యుద్ధంలో 5 కోట్ల మందికిపైగా జనం మృతి.. మళ్లీ ఆనాటి పరిస్థితులు రానున్నాయా?

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఈ యుద్ధం రానున్న కాలంలో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే ప్రపంచం పెను విపత్తుకు సాక్ష్యంగా నిలుస్తుంది. మూడో ప్రపంచ యుద్ధంలో ఎంత విధ్వంసం జరుగుతుందో గ్రహించాలంటే.. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిణామాలను గుర్తు చేసుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఐదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ రెండవ ప్రపంచ యుద్ధం ఎలా మొదలయ్యింది? దాని ఫలితం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1939 సంవత్సరం అంటే దాదాపు 82 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 1న ప్రపంచ యుద్ధం మొదలైంది. తొలుత జర్మనీ.. పోలాండ్‌పై దాడి చేసింది. ఈ దాడితోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ, పోలాండ్‌ల కారణంగా మొదలైన ఈ యుద్ధంలో ప్రపంచంలోని అనేక దేశాలు భాగస్వామ్యమయ్యాయి. సుమారు 6 సంవత్సరాల పాటు ఈ యుద్ధం సాగింది. 1939-45 మధ్య జరిగిన ఈ  యుద్ధంలో రెండు ప్రధాన ప్రత్యర్థి వర్గాలు.. యాక్సిస్ పవర్స్ (జర్మనీ, ఇటలీ,జపాన్)- మిత్రరాజ్యాలు (ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, చైనా) పోరాటం సాగించాయి.  దాదాపు 100 మిలియన్ల మంది ప్రజలు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 


దీనిలో ప్రపంచ జనాభాలో దాదాపు 3 శాతం మంది తుడిచిపెట్టుకుపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభానికి కొన్ని నెలల ముందు జర్మనీ.. యుద్ధాన్ని ప్రకటించకుండా పోలాండ్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్‌లు 1939 సెప్టెంబర్ 3న జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. అదే సమయంలో జపాన్.. సోవియట్ యూనియన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ తొలుత యుద్ధంలో పాల్గొనలేదు. ఆ తరువాత 1940లో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధానికి దిగింది. అనంతరం 1941లో జర్మనీ కూడా సోవియట్ యూనియన్‌పై దాడి చేసింది. వెర్సైల్లెస్ ఒప్పందం, లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం, 1929 నాటి మహా మాంద్యం, ఫాసిజం, నాజీయిజం వృద్ధి మొదలైనవి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలని చెబుతారు. జపాన్‌లోని హీరోషిమా నగరంపై అణుబాంబు వేసిన తర్వాత జపాన్ లొంగిపోయింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం 1945లో ముగిసింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో 61 దేశాలు  పాల్గొని.. సమూహాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల చేతిలో ఓడిపోయిన చివరి దేశంగా జపాన్ మిగిలింది. 

Updated Date - 2022-03-05T14:00:53+05:30 IST