Viral News: Flying Hotelను చూసి షాకవుతున్న నెటిజనం!

ABN , First Publish Date - 2022-07-01T18:31:18+05:30 IST

విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తూ సంవత్సరాలపాటు విమానంలో గాల్లోనే విహరిస్తే ఎలా ఉంటుంది? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదేం పిచ్చి ప్రశ్న.. విమానం భూమిపై ల్యాండ్ కాకుండా ఏళ్లపాటు గాల్లో తిరుగుతుందా? ఇది అ

Viral News: Flying Hotelను చూసి షాకవుతున్న నెటిజనం!

ఇంటర్నెట్ డెస్క్: విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తూ సంవత్సరాలపాటు విమానంలో గాల్లోనే విహరిస్తే ఎలా ఉంటుంది? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఇదేం పిచ్చి ప్రశ్న.. విమానం భూమిపై ల్యాండ్ కాకుండా ఏళ్లపాటు గాల్లో తిరుగుతుందా? ఇది అసాధ్యం అని ఠక్కున అనేస్తారు. కానీ ఇది సాధ్యమే అని ఓ ఇంజనీర్ చెబుతున్నాడు. విలాసవంతమైన హోటల్‌తో రూపొందించిన విమానానికి సంబంధించిన గ్రాఫిక్ వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 



యెమెన్‌కు చెందిన ప్రముఖ సైన్స్ ఇంజనీర్ Flying Hotel‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కాగా.. 5వేల మంది ప్రయాణికులు(అతిథులు) గాల్లో విహరిస్తూ లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసే విధంగా దాన్ని ఇంజనీర్ రూపొందించారు. ఇంత భారీ విమానం గాల్లో నిరంతరాయంగా సంవత్సరాలపాటు ఎగిరేందుకు వీలుగా ఇంజన్‌లు అణు ఇంధనంతో  నడుస్తాయట. అలాగైతే ఈ విమానం ఎప్పటికీ భూమిపై ల్యాండ్ అవ్వదా.. ఒక వేళ అదే నిజమైతే.. ప్రయాణికులు అందులోకి రాకపోకలు ఎలా సాగిస్తారనేగా మీ సందేహం. మీ సందేహం రైటే.. కానీ ఈ Flying Hotel ఎప్పటికీ కిందకు దిగాల్సిన అవసరం లేదని సదరు ఇంజనీర్ చెబుతున్నాడు. ప్రయాణికులను, Flying Hotel‌కు అవసరమయ్యే నిత్యావసరాలను వాణిజ్య విమానాల ద్వారా దాని చెంతకే చేరవేస్తారట. అయితే.. గ్రాఫీక్ వీడియోలో చూడటానికి బాగానే ఉన్నా.. ఈ విమానం ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో వేచి చూడాల్సిందే.


Updated Date - 2022-07-01T18:31:18+05:30 IST