రూ.450కోట్లు పలికిన ప్రపంచ అతిపెద్ద పెయింటింగ్ !

ABN , First Publish Date - 2021-03-24T17:30:39+05:30 IST

బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డార్లకు(రూ. 450కోట్లు) అమ్ముడుపోయి రికార్డుకెక్కింది.

రూ.450కోట్లు పలికిన ప్రపంచ అతిపెద్ద పెయింటింగ్ !

దుబాయ్: బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ దుబాయ్ వేలంలో ఏకంగా 62 మిలియన్ డార్లకు(రూ. 450కోట్లు) అమ్ముడుపోయి రికార్డుకెక్కింది. 'ద జర్నీ ఆఫ్ హుమానిటీ' పేరిట రూపొందించిన ఈ పెయింటింగ్‌ను గీసేందుకు 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ వినియోగించారు జాఫ్రీ. దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో రోజుకు 20 గంటల పాటు సుమారు ఏడు నెలలు కష్టపడి ఈ పెయింటింగ్‌ను గీశారు. కరోనా కాలం మొత్తం దీనిపైనే వెచ్చించినట్లు జాఫ్రీ పేర్కొన్నారు. మొత్తం 70 ముక్కలుగా ఈ పెయింటింగ్ రూపొందింది. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా గిన్నీస్ బుక్‌కెక్కిన ఈ పెయింటింగ్‌ను దుబాయ్ వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి ఏకంగా రూ.450కోట్లకు దక్కించుకోవడం విశేషం.  



Updated Date - 2021-03-24T17:30:39+05:30 IST