ప్రపంచంలో అత్యంత ఖరీదైన పురుగు.. ధర రూ.65లక్షలు.. ఎందుకంత డిమాండ్ అంటే..

ABN , First Publish Date - 2022-03-20T01:15:03+05:30 IST

అదో చిన్న కీటకం. రెండు కొమ్ములతో నలుపు రంగు తలతో.. చూడటానికి పేడ పురుగులా కనిపిస్తుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ ఉంది. సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే.. ఈ పరు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పురుగు.. ధర రూ.65లక్షలు.. ఎందుకంత డిమాండ్ అంటే..

ఇంటర్నెట్ డెస్క్: అదో చిన్న కీటకం. రెండు కొమ్ములతో నలుపు రంగు తలతో.. చూడటానికి పేడ పురుగులా కనిపిస్తుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి భారీ డిమాండ్ ఉంది. సుమారు రెండు అంగుళాల పొడవు ఉండే.. ఈ పరుగు ధర లక్షల్లో ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



చూడటానికి మన ఇళ్లలో కనిపించే పేడ పురుగులా కనిపించే ఈ కీటకాన్ని సాధారణంగా స్టాగ్ బీటల్ అని పిలుస్తారు. ఇక్కడ కుక్కలను, పిల్లులను ఎలాగైతే ఇళ్లలో పెంచుకుంటారో.. జపాన్‌లో కూడా వీటిని అలాగే పెంచుకుంటారు. అక్కడ వీటి కోసం ప్రత్యేకంగా ఆహారం అమ్మే స్టోర్‌లు కూడా ఉన్నాయి. కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం జపనీస్ జాతికి చెందిన ఓ స్టాగ్ బీటల్.. అత్యధికంగా రూ.65లక్షలకు అమ్ముడుపోయింది. ప్రస్తుతం దీని ధర కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. 


Lucanidae ఫ్యామిలీకి చెందిన ఈ కీటకం.. ఎక్కువగా నేలలోనే జీవిస్తుంది. లార్వా దశలో ఇది కుళ్లిన చెట్ల బెరడులను తింటుంది. పరిపక్వత చెందిన తర్వాత చెట్ల రసాలు, పండ్ల రసాలు, నీటిని తాగి జీవిస్తుంటుంది. ఇంతకూ ఈ కీటకాల ఉపయోగం ఏంటో చెప్పలేదు కదూ.. స్టాగ్ బీటల్‌ను మెడిసిన్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 




Updated Date - 2022-03-20T01:15:03+05:30 IST