చౌకబియ్యంలో పురుగులు

ABN , First Publish Date - 2021-06-20T05:03:04+05:30 IST

ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు అందిస్తున్న చౌకబియ్యం పురుగులతో నిండిపోయి నాణ్యత లేక ఉన్నాయని, వాటిని ఎలా తినగలమని నక్కలపల్లె గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

చౌకబియ్యంలో పురుగులు
చౌకబియ్యంతో నిరసన తెలుపుతున్న నక్కలపల్లె గ్రామస్తులు

 నిరసన తెలిపిన గ్రామస్థులు 

చిట్వేలి, జూన్‌19 : ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుదారులకు అందిస్తున్న చౌకబియ్యం పురుగులతో నిండిపోయి నాణ్యత లేక ఉన్నాయని, వాటిని  ఎలా తినగలమని నక్కలపల్లె గ్రామ స్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా ఈ మేరకు మండల పరిధిలోని నక్కలపల్లె గ్రామంలో శనివారం పంపిణీ చేసిన రేషన్‌ బియ్యంలో అధిక సంఖ్యలో పురుగులు  ఉన్నాయని నిరసన వ్యక్తం చేశారు. బియ్యం పంపిణీ చేస్తున్న వాహనాన్ని నిలిపివేసి బియ్యాన్ని తిరస్కరించారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన బియ్యం ఇవేనా అని నిలదీశారు.  నాణ్యత లేని పురుగులుతో నిండిన బియ్యాన్ని ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్ని స్తున్నారు. నాణ్యమైన సన్నబియ్యం అంటే ఇవేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నాణ్యత లేని ముగ్గు వాసనతో పురుగులతో నిండిన బియ్యాన్ని పేద ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  పేదల పట్ల ఇటువంటి వైఖరి తగదని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-06-20T05:03:04+05:30 IST