అధ్వానంగా డైవర్షన్‌ రోడ్డు

ABN , First Publish Date - 2022-06-28T05:05:58+05:30 IST

డైవర్షన్‌ రోడ్డును అధ్వా నంగా ఏర్పాటుచేయడంతో వాహనదారులు తీవ్ర ఇ బ్బందులు పడతున్నారు.

అధ్వానంగా డైవర్షన్‌ రోడ్డు
బల్లికురవ- కొణిదెన రోడ్డులో డైవర్షన్‌ సరిగా లేక బురద మట్టిలో అవస్థలు పడుతున్న వాహన చోదకులు

 బురద మట్టితో అవస్థలు

జారి పడుతున్న వాహనదారులు

బల్లికురవ. జూన్‌ 27: డైవర్షన్‌ రోడ్డును అధ్వా నంగా ఏర్పాటుచేయడంతో వాహనదారులు తీవ్ర ఇ బ్బందులు పడతున్నారు. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మాణం చేస్తున్నారు. ఈక్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా డైవర్షన్‌ రోడ్డు ఏర్పాటుచేశారు. దీనిని సక్రమంగా ఏర్పాటు చేయక పోవటంతో  చిన్నపాటి వర్షం కురిసినా ప్రజలకు ఇ బ్బందులు తప్పడంలేదు. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభిస్తున్నాయి. 

బల్లికురవ - కొణిదెన గ్రామాల మ ధ్య ఉన్న రెండు బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ప్రజలే బ్రిడ్జిలపై మట్టి ని తోలించి రాకపోకలు సాగిస్తున్నారు. రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మం జురు చేయడంతో నెల రోజుల క్రితం పనులు ప్రారం భించా రు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జిల పక్కన డైవర్షన్‌ మాత్రం సక్ర మంగా ఏర్పాటుచే య లేదు. గ్రానైట్‌ ఫ్యాక్టరీల దువ్వ తో లటంతో ప్రతిరోజు ప్రమాదాలు జరు గుతున్నాయి. 

ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి డైవర్షన్‌ ఛిద్ర మైంది. సుద్ధ మట్టి బయటపడటంతో వాహనాలు జారి ప్రమాదాలు జరుగుతున్నాయి. డైవర్షన్‌ పటి ష్టంగా చేయించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇంకా బ్రిడ్జిల ని ర్మాణ పనులు సుమారు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో కొణిదెన రోడ్డులో రాకపోక లు పూర్తిగి నిలిచి పోయే ప్రమాదం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డైవ ర్షన్‌ను పటిష్ట పరచాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-06-28T05:05:58+05:30 IST