అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రహదారి

ABN , First Publish Date - 2021-07-22T04:48:50+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని 40వ జాతీయ రహదారి సమీపంలోగల ఆర్‌అండ్‌బీ రహదారి ప్రమాదకరంగా మారింది.

అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రహదారి
నీటి కుంటగా మారిన ఆర్‌అండ్‌బీ రహదారి

చాగలమర్రి, జూలై 21: చాగలమర్రి గ్రామంలోని 40వ జాతీయ రహదారి సమీపంలోగల ఆర్‌అండ్‌బీ రహదారి ప్రమాదకరంగా మారింది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి రహదారి నీటి కుంటగా మారింది. భారీ గుంతలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు, కూలీలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరు గుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. రహదారి అధ్వానంగా ఉన్నా అధికారులు స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

Updated Date - 2021-07-22T04:48:50+05:30 IST