అంధుల కాలనీలో అధ్వానంగా రోడ్లు

ABN , First Publish Date - 2021-01-17T05:11:39+05:30 IST

అంధుల కాలనీలో నివాసం ఉన్న వా రు అవస్థలు పడుతున్నారు.

అంధుల కాలనీలో అధ్వానంగా రోడ్లు
కాలువలు లేకపోవడంతో నిల్వచేరి పాచిపట్టిన నీరు

కమలాపురం, జనవరి 16: అంధుల కాలనీలో నివాసం ఉన్న వా రు అవస్థలు పడుతున్నారు.  అవి మున్సిపాలిటీ పరిధిలో ఉ న్న కాలనీలైనా అభివృద్ధికి ఆమడదూరంలో ఉండటంతో వారి పరి స్థితి వర్ణనాతీతంగా మారింది. ఎప్పుడో కాలనీ నిర్మాణ సమ యంలో వేసిన సిమెంటు రోడ్డు ఇళ్లకంటే అడుగు నుంచి రెండు అడు గులు దిగువలో ఉండటంతో కొద్దిపాటి వర్షం పడినా నీటి కుంటలుగా కనిపిస్తున్నాయి. రోడు ్డకు ఇరువైపులా డ్రైనేజీ లేక పోవడంతో ఎక్కడ నీరు అక్కడే నిలబడి ఉంది. నీటి నిలువలతో కుంటలను తలపిస్తున్నాయి. నీరు రంగుమారి వ్యర్థాలతో దోమలకు నిలయాలుగా మారింది. అధికారులు అటువైపు చూడకపోవడం అక్కడ పారిశుధ్య పనులు కూడా జరిగే దాఖలాలు కనిపించక పోవడంతో సూర్య పాఠశాల నుంచి ఎదురుగా ఉన్న కాలనీలో వర్ణంచలేని విధంగా తయారయ్యాయి. అధికారులు తమ దుస్థితిని గమనించి డ్రైనేజీతోపాటు సిమెంటు రోడ్లు వేయాలని కాలనీలో నివాసం ఉన్నవారు తెలుపుతున్నారు.

Updated Date - 2021-01-17T05:11:39+05:30 IST