అధ్వానం

ABN , First Publish Date - 2021-05-07T08:05:53+05:30 IST

రుయా ఆస్పత్రిలో 1000పడకలుంటాయి. ఇందులో 250 బెడ్‌లున్న ట్రయేజ్‌ కేంద్రం పాత ప్రసూతి ఆస్పత్రి భవనంలో నడుస్తోంది. ఇక్కడ 170 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. కొవిడ్‌ పాజిటివ్‌ అయిన గర్భిణులను కూడా ఇక్కడ చేర్చుకుంటారు. అయితే ఇక్కడ అందుతున్న వైద్య సేవలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది.

అధ్వానం

రుయా కొవిడ్‌ ట్రయేజ్‌ కేంద్రంలో వైద్య సేవలపై బాధితుల ఆందోళన 

- రుయా ఆస్పత్రిలో 1000పడకలుంటాయి. ఇందులో 250 బెడ్‌లున్న ట్రయేజ్‌ కేంద్రం పాత ప్రసూతి ఆస్పత్రి భవనంలో నడుస్తోంది. ఇక్కడ 170 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. కొవిడ్‌ పాజిటివ్‌ అయిన గర్భిణులను కూడా ఇక్కడ చేర్చుకుంటారు. అయితే ఇక్కడ అందుతున్న వైద్య సేవలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. 

--ఆక్సిజన్‌ అవసరమైనా గుర్తించి ఆక్సిజన్‌ ఏర్పాటు చేయడం లేదు.

--ఇక్కడ చేరిన బాధితుడిని రెండో రోజు గానీ పలకరించడం లేదు. అది కూడా ఆక్సిజన్‌ సాచురేషన్‌ ఎంత అని తెలుసుకోవడం తప్ప షుగర్‌, బీపీ,రక్తపరీక్ష, ఈసీజీ, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేయడం లేదు. 

-- సకాలంలో భోజన సరఫరా లేదు. భోజనం ఒక దగ్గర ఉంటుంది. బెడ్‌పై వున్న బాధితులే వెళ్లి తెచ్చుకోవాలి. ఆక్సిజన్‌ పెట్టుకుని ఉన్నవారు అవి తీసేసి వెళ్లి తెచ్చుకోవాలి. 

-- భోజనం వచ్చిన వెంటనే ఎగబడి అందుకోకపోతే అయిపోతుంది. 

-- భోజనం నాసిరకంగా ఉంటోంది. రుచి, నాణ్యత లేకపోగా  పోషక విలువలున్న ఆహారం ఇవ్వడం లేదు.

-- రాత్రి 11.30గంటల ప్రాంతంలో రోజూ కొందరిని ఇక్కడి నుంచి పద్మావతి కొవిడ్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. ఈ సమాచారం ముందుగా చెప్పకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.

-- కరోనా బాధితులకు ప్రశాంతమైన నిద్ర అవసరం. అయితే ఇక్కడ అరుపులు, కేకలతో రాత్రి నిద్ర కరువవుతోంది. 

-- ఆక్సిజన్‌ మీద ఉన్న వారికి కూడా ఇతరులకు ఇచ్చే ఆహారమే ఇస్తున్నారు. ద్రవాహారం ఇవ్వడం లేదు. 

-- బాత్‌రూములు, మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడం లేదు. 

-- షుగర్‌, బీపీ ఉండి ఇంటి నుంచి మందులు తెచ్చు కోని వారికి ఇక్కడ మందులు ఇవ్వడంలేదు. 

-- జూనియర్‌ వైద్యులు తప్ప సీనియర్లు ఎవ్వరూ ఆస్పత్రిని సందర్శించడం లేదు. 


- తిరుపతి,ఆంధ్రజ్యోతి



 


కంటినిండా 

నిద్ర కరువు

బాధితులకు కంటినిండా నిద్ర ఉండదు.  మంచి నిద్రలో ఉండగా వచ్చి లేపి మీ పేరు ఏమిటి అని ఈ అయిదు రోజుల్లో వంద సార్లు నన్ను అడిగారు. అర్ధరాత్రి వచ్చి గట్టిగా పేర్లు పెట్టి పిలుస్తారు. ఆ సమయంలో కొందరిని తరలిస్తారు. ఈ సమాచారం వారి కుటుంబాలకు కూడా ముందుగా తెలియజేయరు.  రక్త పరీక్షలు చేసినా, వాటి రిపోర్టులు ఇవ్వడం లేదు.  నిద్రపోతే తిండి దొరకదు . రాత్రిపూట భోజనం చాలా మందికి దొరకడం లేదు. నిద్రపోతుంటే ఆహారం అందడం లేదు. ఇంకో వాటర్‌ బాటిల్‌ అడిగితే ఇవ్వరు.  రాత్రుళ్లు ఒకటే అరుపులు. నరకంగా ఉంది.



అర్ధరాత్రి తరలింపులెందుకు? 

కొందరు బాగా చూస్తున్నారు. కొందరు వైద్యులు విసుక్కుంటారు. అందరినీ తప్పుపట్టలేము. ఇక్కడి నుంచీ అర్ధరాత్రి ఎందుకు మారుస్తారో తెలియడం లేదు. అర్ధరాత్రుల్లో అడవారిని ఇక్కడ నుంచి షిప్ట్‌ చేయకుండా మధ్యాహ్నం ఆ పని చేస్తే బాగుంటుంది.


పక్కబెడ్‌ అమ్మాయి తన ఆక్సిజన్‌ ఇచ్చింది

రాత్రి అడ్మిట్‌ అయ్యాను. సాచురేషన్‌ పడిపోయింది. ఆయాసంగా ఉంది.  ఆక్సిజన్‌ అవసరం అని ఇక్కడ చేరాము. ఇప్పటి వరకు ఆక్సిజన్‌ పెట్టలేదు. సూది మందు కూడా ఇవ్వలేదు. పక్క బెడ్‌మీదున్న అమ్మాయి తన 

ఆక్సిజన్‌ నాకు ఇచ్చింది. దాంతోనే ఉన్నా. ఇప్పటికీ ఆయాసంగానే ఉంది.


Updated Date - 2021-05-07T08:05:53+05:30 IST