అధ్వాన రోడ్లు

ABN , First Publish Date - 2021-07-21T05:17:26+05:30 IST

నందికొట్కూరు నుంచి వడ్డెమాను, శాతనకోట, అల్లూరు, మల్యాల గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలమయ్యాయి.

అధ్వాన రోడ్లు
దెబ్బతిన్న శాతనకోట రోడ్డు


నందికొట్కూరు నుంచి వడ్డెమాను, శాతనకోట, అల్లూరు, మల్యాల గ్రామాలకు వెళ్లే  రోడ్లు గుంతలమయ్యాయి. ఈ రోడ్లను గత క్రిష్ణా పుష్కరాల సమయంలో వేశారు.  తుంగభద్ర పుష్కరాలు కూడా వచ్చి పోయాయి. 14 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోడ్లను పట్టించుకోలేదు. గ్రామాల నుంచి నందికొట్కూరు పట్టణానికి వెళ్లే  వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు రోడ్లకు అక్కడ అక్కడ పాచ్‌ వర్క్‌ చేసి వదిలేశారు. అవి మళ్లీ  దెబ్బతిన్నాయి. అల్లూరు, మ ల్యాల, వడ్డెమాను, శాతనకోట గ్రామాల నుండి నందికొట్కూరుకు వెళ్లడానికి దాదాపుగా 6 నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 15 నిమిషాల ప్రయాణం రోడ్లు బాగా లేకపోవడంతో  గంట పడుతోంది. వృద్ధులు, గర్భిణులు  ప్రయాణమంటే భయప డుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
- నందికొట్కూరు రూరల్‌

Updated Date - 2021-07-21T05:17:26+05:30 IST