పిలిచినా వెళ్లేవాడిని కాదు: Opposition meeting పై Owaisi

ABN , First Publish Date - 2022-06-15T22:32:46+05:30 IST

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమక్షంలో మూడు రోజుల నుంచి (సోమవారం, మంగళవారం, బుధవారం) హాజరవుతుండటం మరొక పెద్ద చిక్కు సమస్యగా మారింది..

పిలిచినా వెళ్లేవాడిని కాదు: Opposition meeting పై Owaisi

హైదరాబాద్: బుధవారం మమత బెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశా(Opposition meeting)నికి ఏఐఎంఐఎం(AIMIM)కు ఆహ్వానం అందకపోవడం పట్ల ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) స్పందిస్తూ తనకు ఆహ్వానం రాకపోయినా పరవాలేదని, ఒకవేళ వచ్చినా వెళ్లేవాడిని కాదని అన్నారు. కొంత కాలంగా ఓవైసీని బీజేపీ-బీ టీం(BJP B-team) అంటూ ప్రచారం జరుగుతోంది. బిహార్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ఓవైసీ సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశానికి ఓవైసీని పక్కన పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.


కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమక్షంలో మూడు రోజుల నుంచి (సోమవారం, మంగళవారం, బుధవారం) హాజరవుతుండటం మరొక పెద్ద చిక్కు సమస్యగా మారింది. విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎంసీ (TMC) ప్రకటించినప్పటికీ, బీజేపీ (BJP)ని ఘాటుగా విమర్శించే ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని మమత (Mamata Banerjee) ఆహ్వానించలేదు.


రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని బీజేపీయేతర పక్షాలన్నింటినీ ఆమె ఆహ్వానించారు. మొత్తంగా 22 మంది నాయకులకు ఆహ్వానం పంపారు. అయితే టీఆర్ఎస్, ఆప్, బీజేడీ షాక్ ఇచ్చాయి. మమత ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాబోమని ఈ మూడు పార్టీలు ప్రకటించాయి. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే స్పందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో పాల్గొనలేమని శివసేన (Shiv Sena) గతంలోనే ప్రకటించింది. తమ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే (Udhav Thackeray) ఈ సమావేశం జరిగే సమయంలో అయోధ్యలో పర్యటించబోతున్నారని తెలిపింది. వీరు మినహా మిగిలిన ఆహ్వానితులంతా హాజరయ్యారు.

Updated Date - 2022-06-15T22:32:46+05:30 IST