Pakistan Army Chopper: అదృశ్యమైన పాకిస్థాన్ ఆర్మీ చాపర్ శకలాల గుర్తింపు.. ఆరు మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-08-02T23:26:40+05:30 IST

అదృశ్యమైన పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ (Pakistan Army Aviation Chopper) చాపర్ కుప్పకూలింది. అందులో

Pakistan Army Chopper: అదృశ్యమైన పాకిస్థాన్ ఆర్మీ చాపర్ శకలాల గుర్తింపు.. ఆరు మృతదేహాలు లభ్యం

ఇస్లామాబాద్: అదృశ్యమైన పాకిస్థాన్ ఆర్మీ ఏవియేషన్ (Pakistan Army Aviation Chopper) చాపర్ కుప్పకూలింది. అందులో ఉన్న ఆరుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మిలటరీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సర్ఫరాజ్ అలీ కూడా ఉన్నారు. చాపర్ కరాచీ వెళ్తుండగా విందార్-సాసీ పన్ను మందిరం ప్రాంతాల మధ్య కుప్పకూలింది. బలూచిస్థాన్ ప్రావిన్సు(Balochistan province)లోని ముసాగోత్ (Musa Goth) వద్ద వారి ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశం వద్ద శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు.


ఉథాల్ నుంచి నిన్న సాయంత్రం 5:10 గంటలకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ 6:05 గంటలకు కరాచీ (karachi)లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, టేకాఫ్ అయిన కాసేపటికే ఏటీసీ (ATC)తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత పర్వత ప్రాంతమైన బలూచిస్థాన్ ప్రావిన్సులో కుప్పకూలింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల బలూచిస్థాన్‌లో సంభవించిన భారీ వర్షాలు, అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా 478 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-08-02T23:26:40+05:30 IST