ltrScrptTheme3

జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో తలుపుల విద్యార్థి సత్తా

Oct 27 2021 @ 00:44AM

తలుపుల, అక్టోబరు 26 : మండలంలోని గరికిపల్లికి చెందిన క్రీడాకారిణి స్నేహలతారెడ్డి జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనపరచి రజిత పతకం సాధిం చింది. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో ఈ నెల 20 వ తేది నుండి జరిగిన జాతీయ స్థాయి కుస్తీ పోటీలలో స్నేహల తారెడ్డి పాల్గొన్నారు. జూనియర్‌ విభాగంలో అత్యంత ప్రతిభ కనపరచి రజిత పతకం సాధించింది. ఈ క్రీడాకారిణి ఈ నెల మొదటి వారంలో అనంతపురంలో జరిగిన కుస్తీ పోటీ ల్లో బంగారు పతకం సాధించి, ఢిల్లీలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. విద్యార్థిని తిరుపతిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.