
ముంబై: స్వదేశీ మైక్రోబ్లాగింగ్ యాప్ కూ (Koo)కు ఇండియన్ క్రికెటర్ల మద్దతు పెరుగుతోంది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మ్యాచ్ అనంతరం ‘కూ’ చేశాడు. పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ట్రోఫీలో చివరి వరకు ఉంటున్నందుకు సంతోషంగా ఉందన్నాడు.
సాహా సహచరుడు మహ్మద్ షమీ (Mohammed Shami) కూడా కూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. గుజరాత్ కుర్రాళ్లు మరోమారు అద్భుత ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు. మరోవైపు, అభిమానులు కూడా జట్ల గెలుపోటములపై కూ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కొత్త జట్టు అయిన గుజరాత్ టైటాన్స్ అరంగేట్రంలోనే అదరగొడుతుండడంపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
