చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-02-09T19:06:41+05:30 IST

చర్మం ముడతలు పడడం వయసుతో పాటుగా వచ్చే సహజమైన మార్పు. శరీరతత్వం, జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా

చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(09-02-2022)

ప్రశ్న: నాకు నలభై ఏళ్లు. చర్మం ముడతలు పడుతోంది. ఆహారంతో ఈ సమస్యకు పరిష్కారం ఉందా?


- అవని, విజయవాడ


డాక్టర్ సమాధానం: చర్మం ముడతలు పడడం వయసుతో పాటుగా వచ్చే సహజమైన మార్పు. శరీరతత్వం, జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే కాకుండా జీవనశైలిని బట్టి కూడా చర్మం తీరు ఉంటుంది. కాబట్టి జీవనశైలిలో మంచి మార్పుల వల్ల ద్వారా వయసుతో పాటుగా చర్మం ముడతలు పడడాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజాపండ్లు, కాయగూరలు, ఆకుకూరలు రోజూ తీసుకోవాలి. విటమిన్ - ఎ అధికంగా ఉండే క్యారెట్, టొమాటో, పాలకూర, చిలగడ దుంపలు, బ్రొకోలి మొదలైనవి తరచుగా తినాలి. నీరు ఎక్కువగా ఉండే సొరకాయ, దోసకాయ, కీరదోస, ముల్లంగి లాంటి కూరగాయలు అధికంగా తీసుకుంటే మేలు. రోజూ కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. ఎక్కువసేపు ఎండలో సమయం వెచ్చించాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ తప్పనిసరి. బయటి నుండి రాగానే ముఖాన్ని చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవడం, చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాసుకోవడం, డాక్టర్ల సలహాతో ఏదైనా యాంటీఏజింగ్ క్రీమ్స్ వాడడం వల్ల ఉపయోగం ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-02-09T19:06:41+05:30 IST