మాస్కు ధరించని వారికి ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర శిక్ష!

ABN , First Publish Date - 2020-07-13T18:35:49+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం మాస్కు పెట్టుకోనివారికి విచిత్రమైన శిక్ష విధించేందుకు నిర్ణయించింది.

మాస్కు ధరించని వారికి ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర శిక్ష!

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం మాస్కు పెట్టుకోనివారికి విచిత్రమైన శిక్ష విధించేందుకు నిర్ణయించింది. ఇటువంటి వారితో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి అనే వాక్యాన్ని 500 సార్లు ఇంపోజిషన్ రాయించాలని డిసైడైంది. ఈ శిక్షకు మాస్కు పాఠం అనే ఉపయుక్తమైన పేరును కూడా అక్కడి అధికారులు నిర్ణయించారు. వీధుల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని  ఓ తరగతి గదిలో కూర్చోపెట్టి ఈ శిక్షను అమలు చేస్తారని సమాచారం.


ఇందులో మొట్టమొదటగా.. మాస్కు ఉపయోగాలను తెలియజేసే ఓ వీడియోను మాస్కు పెట్టుకోని వ్యక్తులకు చూపిస్తారు. అనంతరం.. వారితో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి అనే వాక్యాన్ని ఐదు వందల సార్లు ఇంపోజిషన్ రాయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారమంతా పూర్తయ్యే సరికి వీరు ఏకంగా మూడు నాలుగు గంటల పాటు క్లాస్ రూంలో గడపాల్సి వస్తుందని తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు పెట్టే బదులు ఈ రకమైన శిక్షలు విధిస్తే ఆశించిన ఫలితాలు సులువుగా వస్తాయని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. 

Updated Date - 2020-07-13T18:35:49+05:30 IST