రైతు వేదికలతో కర్షకులకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2021-04-12T04:40:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు మండల పరిధిలోని క్లస్టర్‌లలో రైతువేదికలను నిర్మించి వ్యవసాయాధికారులతో ప లు సూచనలు సలహాలు పొందేందుకు రైతులకు అవకాశం కల్పించింది.

రైతు వేదికలతో కర్షకులకు తప్పని తిప్పలు
అంబార్‌పేటలో నిర్మించిన రైతు వేదిక

మూడు గ్రామాల రైతులకు పెరిగిన దూరభారం
ప్రభుత్వ విప్‌ కలిపించుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్న రైతులు
దోమకొండ, ఏప్రిల్‌ 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు మండల పరిధిలోని క్లస్టర్‌లలో రైతువేదికలను నిర్మించి వ్యవసాయాధికారులతో ప లు సూచనలు సలహాలు పొందేందుకు రైతులకు అవకాశం కల్పించింది. దోమకొండ మండలంలో మొత్తం పది గ్రామాలు న్నాయి. ఇందులో దోమకొండ, అంబార్‌పేట రెండు క్లస్టర్‌లుగా ఏర్పాటు చేశారు. దోమకొండ క్లస్టర్‌లో ముత్యంపేట, చింతమా న్‌పల్లి, లింగుపల్లి, దోమకొండ, శేరీబీబీపేట, అంబార్‌పేట క్లస్టర్‌లో సంగమేశ్వర్‌, గొట్టిముక్కుల, అంచనూర్‌, సీతారాంపల్లి, అంబార్‌పేట గ్రామాలున్నాయి. అయితే అంచనూర్‌, సంగమే శ్వర్‌, గొట్టిముక్కుల గ్రామాలు దోమకొండ చుట్టూ మూడు కిలో మీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఈ మూడు గ్రామాల రైతులు అంబార్‌పేట రైతు వేదికకు వెళ్లాలంటే  మరో  ఆరు కిలో మీటర్లు ప్రయాణం చేయావలసిందే. దీంతో రైతులు అంత దూరం వెళ్లాలంటే ఇష్టపడటం లేదు. ప్రభుత్వం తమ తమ క్లస్టర్‌లలోనే వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉంటూ వి ధులు నిర్వహించాలనడంతో దోమకొండ రైతువేదికలో ఏఈవో క్రిష్ణారెడ్డి, అంబార్‌పేట రైతువేదికలో ఏఈవో శ్రీలతలు విధులు నిర్వహిస్తున్నారు. ఏఈవోతో ఏదైన  ధ్రువపత్రాలపై సంత కాలు అవసరమైతే అంబార్‌పేటకు వెళ్లవలసిన పరిస్థితి నెలకొ ంది.  దోమకొండకు కూతవేటు దూరంలో ఈ గ్రామాలు ఉండ టంతో ప్రతీరోజు దోమకొండకే వివిధ పనులపై రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఏఈవోతో సంతకాలు అవసరమైనప్పడు అంబార్‌పేటకు వెళ్లవలసి వస్తోందని అక్క డికి వెళ్లడానికి బస్సు సౌకర్యం కూడా లేదని రైతులు వాపోతున్నారు. అంబార్‌పేట క్లస్టర్‌ ఏఈవోనే అక్కడ విధులు ముగించుకుని సాయంత్రం సమయంలో దోమకొండ రైతు వేదికకు చేరుకుని ఇక్కడి గ్రామాల రైతులకు సేవాలందిస్తున్నా రు. అందరు రైతులు ఒకే దగ్గర కలసి ఏవైన సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రైతువేదికలను నిర్మించి ంది. రైతు వేదికలను ప్రణాళిక ప్రకారం నిర్మించి ఉంటే అన్ని గ్రామాల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని రైతు లు తెలుపుతున్నారు. ముఖ్యంగా శేరీబీబీపేట గ్రామం దోమ కొండ క్లస్టర్‌లో ఉంది. శేరీబీబీపేట నుంచి దోమకొండకు రైతు లు రావాలంటే 11 కిలో మీటర్లు రావాలి. అక్కడి రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ రైతువేదికల పట్ల రైతులకు దూరభారం కలుగకుండా దృష్టి సారించి  సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల రైతులు విప్‌ను కోరుతున్నారు.

Updated Date - 2021-04-12T04:40:13+05:30 IST