చాణక్య నీతి: ఈ పనుల చేసేవారి దగ్గర డబ్బు నిలవదు... నిత్యం ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి!

Oct 6 2021 @ 06:39AM

చాణక్య నీతి మనిషి తన జీవితంలో విజయం సాధించడానికి ప్రేరణ కల్పిస్తుంది. చాణక్య నీతిని ఆచార్య చాణక్య రచించారు. చాణక్యుడు భారతదేశంలోని ఉత్తమ పండితులలో ఒకరు. ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు మనిషిలో ఆత్మస్థయిర్యాన్ని పెంచుతాయి. చాణక్య నీతిని నేటికీ అనుసరిస్తుండటానికి ఇదే ప్రధాన కారణం. ఈ ఆధునిక కాలంలోనూ చాణక్య నీతిని అధ్యయనం చేసేవారి సంఖ్య అధికంగా ఉంది. వారంతా తమ రోజువారీ జీవితంలో సమస్యలను అధిగమించడానికి చాణక్యనీతిని అనుసరిస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం మనిషి జీవితంలో సంపద కీలక పాత్ర పోషిస్తుంది. ఆచార్య చాణక్య లక్ష్మిదేవిని సంపదకు దేవతగా వర్ణించారు. అందరి మనసులోనూ డబ్బు కావాలనే కోరిక ఉంటుంది.

డబ్బు సంపాదించేందుకు మనిషి చాలా కష్టపడతాడు. ఇందుకోసం ఎంతటి రిస్క్ తీసుకునేందుకైనా సిద్ధపడతాడు. చాణక్య నీతి ప్రకారం డబ్బును సంపాదించడం ద్వారా జీవితంలోని సమస్యలను అధిగమించవచ్చు, తగినంత డబ్బు సమకూరినపుడు జీవితం సాఫీగా సాగుతుంది. డబ్బు సంపాదించిన వ్యక్తిలో తనపై తనకు నమ్మకం పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా దక్కుతుంది. చాణక్య నీతి ప్రకారం జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడ్డవారితో సాంగత్యం వద్దు: చాణక్య నీతి ప్రకారం మనిషి సాంగత్యం విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. చెడ్డవారితో సాంగత్యం ఉండకూడదు. తప్పుడు పనులు చేసే వారికి దూరంగా ఉండాలి. తప్పుడు మార్గంలో నడిచేవారిని ప్రోత్సహించినా, అటువంటి మార్గంలో నడచినా లక్ష్మీదేవి అనుగ్రహం వారికి లభించదు. అంటే వారి దగ్గర డబ్బు ఎప్పటికీ నిలువదు. 

ఇతరులను అవమానించడం తగదు: చాణక్య నీతి ప్రకారం సమాజంలో పరస్పరం గౌరవభావంతో మెలగాలి. ఇతరులను తప్పనిసరిగా గౌరవించాలి. ఇతరులను గౌరవించని వారు తమ స్థాయిని తెలుసుకోలేదు. ఎవరినీ ఆదరించలేరు. ఇటువంటివారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ఇతరులను గౌరవించనివారు తరువాత చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.