తల్లి శృంగారానికి ఒప్పుకోలేదని.. కుమారుడి జీవితాన్ని బుగ్గి చేశాడు..! ఏకంగా 23 ఏళ్ల పాటు..

ABN , First Publish Date - 2022-03-21T03:36:58+05:30 IST

తన తల్లిని అనుభవించలేకపోయిన ఓ వ్యక్తి తనపై కక్ష తీర్చుకున్నాడంటూ ఓ వ్యక్తి కోర్టు కెక్కాడు. తాను ఏ పాపం చేయకపోయినా 23 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించానని వాపోయాడు. దీనికి పరిహారంగా ప్రభుత్వమే 93 మిలియన్ డాలర్లు తనకు చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

తల్లి శృంగారానికి ఒప్పుకోలేదని.. కుమారుడి జీవితాన్ని బుగ్గి చేశాడు..! ఏకంగా 23 ఏళ్ల పాటు..

ఎన్నారై డెస్క్: తన తల్లిని అనుభవించలేకపోయిన ఓ వ్యక్తి తనపై కక్ష తీర్చుకున్నాడంటూ ఓ వ్యక్తి కోర్టు కెక్కాడు. తాను ఏ పాపం చేయకపోయినా 23 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించానని వాపోయాడు. దీనికి పరిహారంగా ప్రభుత్వమే 93 మిలియన్ డాలర్లు తనకు చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2018లో అతడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. త్వరలో కోర్టు విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ఈ కేసు అమెరికాలో కాన్సాస్ నగరంలో కలకలానికి దారితీస్తోంది. ఇలా అకారణంగా బలైపోయిన ఆ అభాగ్యుడి పేరు లామోంట్ మెకింటైర్..


లామోంట్ తల్లి కూడా తనకు 30 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ స్థితికి గోలుబ్‌స్కీ అనే మాజీ పోలీసు డిటెక్టివ్ కారణమని స్పష్టం చేశారు. తల్లీకుమారుల ఫిర్యాదు ప్రకారం.. కొన్నేళ్ల క్రితం గోలుబ్‌స్కీ లామోంట్ తల్లిపై ఒత్తిడి తెచ్చి ఆమెను అనుభవించాడు. ఆ తరువాత కూడా అతడు ఆమెను బలవంతం చేయబోగా..ఆమె అంగీకరించలేదు. దీంతో.. ఆమెపై కోపం పెంచుకున్న గోలుబ్‌స్కీ ఆమె కుమారుడి లామోంట్‌ను డబుల్ మర్డర్ కేసులో ఇరికించి జైలు పాలు చేశాడు. దీంతో.. బాధితుడు లామోంట్ 23 ఏళ్ల పాటు జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. గోలుబ్‌స్కీ తన కెరీర్‌లో ఎంతో మంది నల్లజాతి మహిళలను వేధించాడని, సాటి పోలీసు ఆఫీసర్లకు కూడా అతడి దుర్మార్గాల గురించి తెలుసునని వారు పేర్కొన్నారు. మొతం 73 మంది బాధిత మహిళల పేర్లను ఇనీషియల్స్ రూపంలో(పేరులోని తొలి అక్షరాలు) తమ ఫిర్యాదులో ప్రస్తావించారు. 2018లో వారు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం త్వరలో విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.


బాధితుడు మెకింటైర్ 2017లో జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి ఫిర్యాదులన్నీ రద్దు చేయాలని స్థానిక ప్రాసిక్యూటర్ కోరడంతో ప్రభుత్వం అతడిని నేరాల నుంచి విముక్తుడిని చేసింది. అతడు నిర్దోషి అంటూ ఓ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్నోసెన్స్‌ను బాధితుడికి జారీ చేయడమేకాకుండా.. పరిహారం కింద ప్రభుత్వం 1.3 మిలియన్ డాలర్ల కూడా చెల్లించింది. అయితే.. తమకు న్యాయం జరగలేదని భావించిన బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.


అరిజోనా రాష్ట్రంలో నివసిస్తున్న మెకింటైర్ ప్రస్తుతం పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. తరచూ నెగెటివ్ భావనలు అతడిని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తుంటాయి. మెకింటర్ తల్లి కూడా 17 ఏళ్లుగా తీవ్ర మాసిక ఒత్తిడిలో కూరుకుపోయింది. చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే.. స్థానిక ప్రభుత్వం మాత్రం లామోంట్ పరిస్థితికి తాను బాధ్యులం కాదని స్పస్టం చేస్తోంది. అప్పటి పోలీస్ చీఫ్‌కు గోలుబ్‌స్కీ చేసిన దుర్మాగాల గురించి తెలుసున్న ఆరోపణను కొట్టిపారేసింది. గోలుబ్‌స్కీ నేరాలు రుజువైనా కూడా అవి అతడి వృత్తిగత నిబంధనల పరిధిలోకి రావని చెబుతోంది. కాన్సాస్ నగరంలో ఈ కేసు తీవ్ర చర్చోపచర్చలకు కారణమవుతుండడంతో.. విచారణకు విచిటా నగరంలో చేపట్టాలని కూడా కోరుతోంది.

Updated Date - 2022-03-21T03:36:58+05:30 IST