అడుగుకో గోతి అంగుళానికో అతుకు

ABN , First Publish Date - 2021-03-01T04:49:52+05:30 IST

అసలే అవి ఒక వరుస రోడ్లు. అవి కూడా గుంతల మయం! పైగా అటూఇటూ చెట్లకొమ్మలు కమ్మేసి ఉంటాయి. ఎదురుగా ఏ వాహనం వస్తుందో అర్థం కాదు. చీకట్లో అయితే అంతే సంగతులు. ఈ మార్గంమీదుగా ప్రయా ణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.

అడుగుకో గోతి అంగుళానికో అతుకు
రోడ్డుపై గోతిపడటంతో ప్రమాదసూచికగా వెదురు కర్రలు ఏర్పాటు చేసిన స్థానికులు

అన్నపురెడ్డిపల్లిలో అధ్వానంగా రహదారులు

నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు

ఇబ్బందిపడుతున్న వాహనదారులు

నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న ఆర్‌అండ్‌బీ అధికారులు

అన్నపురెడ్డిపల్లి, ఫిబ్రవరి 28: అసలే అవి ఒక వరుస రోడ్లు. అవి కూడా గుంతల మయం! పైగా అటూఇటూ చెట్లకొమ్మలు కమ్మేసి ఉంటాయి. ఎదురుగా ఏ వాహనం వస్తుందో అర్థం కాదు. చీకట్లో అయితే అంతే సంగతులు. ఈ మార్గంమీదుగా ప్రయా ణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇదీ అన్నపురెడ్డిపల్లి మండలంలో రోడ్ల దుస్థితి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. పుణ్యక్షేత్రాలకు నిలయమైన అన్నపురెడ్డిపల్లి మండలంగా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా రోడ్లకు మోక్షం కలగలేదు. గతేడాది కురిసిన వర్షాలకు భ్రమరాంబ సమేత మల్లికార్జున దేవాలయం ఎదుట ఉన్న రోడ్డుకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయి కోతకు గురై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. అన్నపురెడ్డిపల్లి నుంచి కొత్తగూడెం వరకు, శాంతినగర్‌  జాతీయరహదారి నుంచి ములకలపల్లి మండలంలోని మాదారం వరకు రెండు వరుసల రోడ్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేసినా ఇంత వరకూ అతీగతీ లేదు. ప్రతీ ఏడాది శివరాత్రి, బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో సింగిల్‌ రోడ్డుపై వందల సంఖ్యలో వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎదురుగా వచ్చే వాహనం తప్పించే క్రమంలోచాలా ప్రమాదాలు జరిగాయి. అధికారులు పట్టించుకో కపోగా రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి నిధులు దుర్వినియోగానికి పాల్పడుతు న్నారనే ఆరోపణలున్నాయి. రాజాపురం నుంచి మర్రిగూడేం వరకు సుమారు రూ3కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుపై సీతారామ ప్రాజెక్ట్‌ పనుల నిమిత్తం భారీ వాహనాలు వెళ్తుండటంతో నామరూపాల్లేకుండా పోయింది. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ లక్మణ్‌నాయక్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా శివరాత్రికి రోడ్లు మరమ్మతులు చేయిస్తామని, మండలకేంద్రంలోని బాలాజీ ఆలయం నుంచి ఒడ్డుగూడెం వరకు రోడ్డు పనులను త్వరలో ప్రారంభిస్తామని వివరించారు.


Updated Date - 2021-03-01T04:49:52+05:30 IST