వైసీపీలో మహిళలకే పెద్దపీట : మేకపాటి

Published: Wed, 17 Aug 2022 22:14:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వైసీపీలో మహిళలకే పెద్దపీట : మేకపాటిసచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

కలిగిరి, ఆగస్టు 17: వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌ మహిళలకు పెద్దపీటవేసి అన్నిరంగాల్లో వారికి సముచిత స్థానం కల్పించినట్లు ఎమ్మెల్యే మేకపాటి చద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలిగిరి-1 గ్రామ సచివాలయాన్ని నియోజకవర్గ ప్రచార కార్యదర్శి శాంతకుమారితో కలిసి  ఆయన ప్రారంభించారు. అనంతరం గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా మసీదువీధి, ఎస్టీ కాలనీలను సందర్శించారు. నూతనంంగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అదజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాలూరు మాల్యాద్రిరెడ్డి, సర్పచు రాగి దివ్య, ఉపసర్పంచు పాలూరు కొండారెడ్డి, వైసీపీ కన్వీనర్‌ కాటం రవీంద్రరెడ్డి,తహసీల్దారు కృష్ణప్రసాద్‌, ఎంపీడీవో కళాధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


 22న వేంకటేశ్వర కల్యాణం


ఈనెల 22న ఉదయగిరిలో వేంకటేశ్వరస్వామి  కల్యాణం  నిర్వహిస్తున్నట్లు మేకపాటి తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలంతా హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని  కోరారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.