అన్యాయం చేయడానికేనా అధికారమిచ్చింది?

ABN , First Publish Date - 2021-01-17T05:54:08+05:30 IST

ఒక్క అవకాశమని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ధ్వజమెత్తారు.

అన్యాయం చేయడానికేనా అధికారమిచ్చింది?

  1.  వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు 
  2.   వై నాగేశ్వరరావు యాదవ్‌ 


డోన్‌, జనవరి 16: ఒక్క అవకాశమని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నారని గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌ ధ్వజమెత్తారు. శనివారం డోన్‌ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, బత్తిన వెంకటరాముడు, వలసల రామకృష్ణ, వెంకటరమణాచారిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం.. అందుకు వ్యతిరేకంగా జీవోలు జారీ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.2900 కోట్లు రైతులకు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని వై.నాగేశ్వరరావు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. ఈనెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలను డోన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని, ప్యాపిలిలో ఏర్పాటు చేస్తున్న  రక్తదాన శిబిరానికి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో డోన్‌ మండల టీడీపీ ఆధ్యక్షుడు వెంగనాయునిపల్లి శ్రీను, ప్యాపిలి అధ్యక్షుడు రామసుబ్బయ్య, కమలాపురం మధుసూదన్‌బాబు, అలేబాదు పరమేష్‌, సుధాకర్‌, రామ్మోహన్‌ యాదవ్‌, ఎల్లగౌడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:54:08+05:30 IST