TelanganaNews: వలిగొండలో కారు బీభత్సం

ABN , First Publish Date - 2022-05-13T13:57:09+05:30 IST

జిల్లాలోని వలిగొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రెండు బైకులను ఢీ కొట్టి, పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది.

TelanganaNews: వలిగొండలో కారు బీభత్సం

యాదాద్రి: జిల్లాలోని వలిగొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టి, పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more