భక్తజన సంద్రం యాదాద్రిక్షేత్రం

Published: Sat, 02 Apr 2022 21:34:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భక్తజన సంద్రం యాదాద్రిక్షేత్రం

యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. వారాంతపు సెలవురోజు, తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్ర సందర్శనకు తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్టలో మొక్కు తలనీలాలు సమర్పించుకున్న భక్తజనులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలోని టికెట్‌ కౌంటర్‌లో ఉచిత దర్శనం టోకెన్లు తీసుకుని కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.